కూర‌ల‌మ్మేవాళ్ల దేశ‌భ‌క్తి

భ‌క్తి, ప్రేమ‌లు మ‌న‌సులో ఉండాలే గాని మైకుల్లో గోల‌చేయ‌ న‌క్క‌ర్లేదు. భారీ ప్ర‌చారాలేమీ అక్క‌ర్లేదు. చిన్న‌ పాటి ప‌ని చాలు. అమృతోత్స‌వ్ పేరు తో బీజేపీవారికున్నంత దేశ‌భ‌క్తి మాకు లేదుగాని మాకున్నంత‌లో మాదీ దేశ‌భ‌క్తే అంటున్నారు కూర‌ గాయ‌ల మార్కెట్లో దుకాణాల‌వారూ. నిజమే రాజ‌కీయ‌నాయ‌కుల‌కు, పారిశ్రామిక వేత్త‌ల‌కే కాదు అంద‌రికీ ఉంటుంది. ఎవ‌రి స్థాయిలో వారు దాన్ని ప్ర‌ద‌ర్శిస్తారు. 

ఇది ఏ ఊరు, ఎక్క‌డా అన్న‌ది అవ‌త‌ల‌పెడితే, అస‌లు ఇలా కూడా దేశ‌భ‌క్తిని ప్ర‌ద‌ర్శించ‌వ‌చ్చ‌న్న ఆలోచ‌న‌కే జ‌య‌హో అనొచ్చు. మార్కెట్లో వారంతా ఆశ్చ‌ర్య‌పోయారు. అంద‌రూ ఇలానే వారి దుకాణాల ముందు ఏర్పాటు చేశారు. పారిశ్రామిక‌ వేత్త‌లు వారి సంస్థ‌ల పైనా జెండా ఏర్పాటు చేస్తారు, నాయ‌కులు వారి వారి కార్యాల‌యాల్లో, స్కూళ్ల‌లో ఉపాధ్యాయులు. కూర‌గాయ‌లు అమ్మేవారు మార్కెట్లో పెట్టుకున్నారు. వీరి ప్ర‌య‌త్నం బ‌హుశా రైతుల ప‌రంగా దేశ‌భ‌క్తిని ప్ర‌క‌టిస్తున్నారేమో! దేశానికి వెన్నెముక రైతాంగం అనేది అనాదిగా మ‌న దేశం గురించి చెప్పుకుంటూన్నాం. కానీ ప్ర‌భుత్వాలేవీ ఇటీవ‌లి కాలంలో వారి గోడే పట్టించుకోవ‌డం లేదు. అందుకే వారు ఆగ్ర‌హించి ఎదురుతిరుగుతున్నారు. ఇదే ఆ మ‌ధ్య గుజ‌రాత్ రైతాంగం చేసి న‌ది. ధ‌డిసి, ఏమీ చేయ‌లేని స్థితిలో కేంద్రం దిగివ‌చ్చింది.

రైతుల సంర‌క్ష‌ణే మా ల‌క్ష్యం అంటూ అజెండాల్లో రాసుకునే మ‌హానేత‌లు రైతుల వెన్నే విరుస్తున్నారు. తిండిపెడుతున్న‌వారికే తిండి లేకుండా చేయ‌డానికి సాహ‌సిస్తున్నారు. అంతా పారిశ్రామిక వాడ‌ల‌వుతున్నాయే గాని పంట‌భూములు దెబ్బ‌తింటు న్నాయన్న‌ది తెలియ‌కా కాదు. ఏదో ఒక పండ‌గ‌రోజునో, స్వాతంత్య్ర‌దినోత్స‌వం రోజునో రైతాంగాన్ని ఆకాశానికి ఎత్తే కేంద్ర, రాష్ట్ర ప్ర‌భు త్వాలు రైతుల్ని గుర్తుచేసుకోవ‌డ‌మే అవుతోంది. కానీ వారి దేశ‌భ‌క్తి ఉంద‌న్న‌ది కూర‌గాయ‌లు అమ్మేవారి ద్వారా ప్ర‌క‌టించారు.