కొత్త‌గా 10ల‌క్ష‌ల పెన్ష‌న్ల మంజూరు.. క్యాబినెట్ నిర్ణ‌యం

తెలంగాణ కేబినెట్ భేటీ లో మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ క్యాబినెట్ నిర్ణయిం చింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్ల అందజేస్తోంది.తాజాగా అదనంగా 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణ యించింది. కొత్తవి,. పాతవి కలిపి మొత్తం 46 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

తెలంగాణలోని సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గురువారం(ఆగ‌ష్టు11) నిర్వహించిన మంత్రివ‌ర్గ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించింది. ఈ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కేబినెట్ సమా వేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి 15 ఆగస్టు నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తూ తెలంగాణ మంత్రివర్గం  నిర్ణయం తీసు కుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్ష న్లకు అదనంగా 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో మొత్తంగా కొత్తవి, పాతవి కలిపి 46 లక్షల పెన్షన్ దారులకు కార్డులు మంజూరు చేయనున్నారు.

దీంతో పాటు స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఇక కోఠి ఈఎన్.టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయా లని ఆదేశించింది. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.

ఇక స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీల విడుదలకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కోఠి ఈఎన్. టి. ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల మంజూరుకు ఆమోదం తెలిపింది.  అలాగే కోఠి ఈఎన్‎టి ఆస్పత్రి లో అధునా తన సౌకర్యాలతో టవర్ నిర్మించాలని మంత్రులు నిర్ణయించారు. సరోజినీ దేవి కంటి దావాఖానలో కూడా అధునాతన సౌక ర్యాలతో కూడిన నూతన భవన సముదాయాన్ని నిర్మించేందుకు మంత్రులు ప్రతిపాదనలు చేశారు.