పోటీల‌లో  ఇదో  పోటీ!

పోటీలు అన‌గానే క్రీడారంగంలో పోటీలు, రాజ‌కీయ‌రంగంలో పోటీప‌డ‌టాలు గురించే అంద‌రికీ తెలు స్తుంది. కానీ చిత్రంగా అస్స‌లు ఎవ్వ‌రూ ఊహంచ‌ని స‌రికొత్త పోటీ ఒక‌టి ఈమ‌ధ్య నిర్వ‌హించారు. అపాన‌వాయు పోటీ!  ఆమ‌ధ్య ఏదో సినిమాలో ముగ్గురు క‌మెడియ‌న్లు యూ.ఎస్‌లో ఒక న‌గ‌రం వీధిలో నిల‌బడి అపాన‌వాయు వ‌ద‌లుతారు, దాని ధాటికి చాలామంది పారిపోతారు!

ఇదో  సినిమాలో కామెడీ సీన్ ! అది ప్రేక్ష‌కుల‌కు స‌ర‌దా కోసం సినిమావారు క‌ల్పించిన ఒక సీన్‌. త‌ల‌చు కుంటే న‌వ్వొస్తుంది. కానీ అలా నిజంగానే అవుతుందా అంటే ! ఏమో అనే సందేహాస్ప‌ద స‌మాధానాలూ విన‌వ‌ల‌సివ‌స్తుంది. మావూళ్లో ఒక పెళ్లి భోజ‌నం చేసిన ఓ పెద్దాయ‌న‌... అంటూ ఎవ‌రికి తోచిన విధంగా వారు ఏదో ఒక విచిత్ర వివ‌ర‌ణ‌ల‌తో ఇలాంటి సంఘ‌ట‌న‌లు గుర్తుచేసుకున్నా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌ పోన‌క్క‌ ర్లేదు. 

ఇలాంటి పోటీ ఏమిట‌న్న‌దే ఇపుడు అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్న‌ది. ఇది ఎక్క‌డో విదేశాల్లో కాదు.. చ‌క్క‌గా మ‌న దేశంలోనే నిర్వ‌హించారు.  ఈపోటీలో పాల్గొన‌డానికి ఏకంగా ముంబై, జైపూర్‌, దుబాయ్ వంటి న‌గ‌ రాల నుంచి కూడా పేర్లు న‌మోద‌య్యాయి! 

ఒక పెద్ద గ‌ది.. ఎంతో చ‌క్క‌టి సుగంధ‌ద్ర‌వ్యాల‌తో సువాస‌న‌ల‌తో ఆక‌ట్టుకుంటుంది. ఎంతో శుభ్రంగా అలంక‌రించి ఉంటుంది. ఆ గ‌దిలోకి ఒక వ్య‌క్తిని పంపిస్తారు. అత‌ను అపాన‌వాయు వదులుతాడు.. అది ఎంత‌గా దారుణంగా వాతావ‌ర‌ణాన్ని కంపుమ‌యం చేస్తుందో అంచ‌నా వేస్తారుట‌! ఎలా చేస్తార‌న్న‌ది వ‌దిలేద్దాం. అలా చేసిన త‌ర్వాత‌. మ‌రో వ్య‌క్తిని మ‌రో గ‌దిలోకి పంపుతారు. ఇలా ఉన్న రెండు గ‌దుల్లోకి లెక్ ప్ర‌కారం, స‌మ‌యాన్న‌నుస‌రించి శుభ్ర‌త జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ మ‌రీ పంపుతార‌ట‌! ఫైన‌ల్‌గా ఎవ‌రు ఎంత‌గా ఇబ్బందిపెడితే వారే విజేత‌!  ప‌రామ‌ర్ అనే మ‌హిళ ఈ పోటీల‌కి  జ‌డ్జి. ఊహంచ‌ని ఈ పోటీల‌కు త‌న‌ను జ‌డ్జిగా నియ‌మించ‌డం గురించి చెబుతూ న‌వ్వు ఆపుకోలేక‌పోయిందామె. 

ఇదే కాంపిటీష‌నండీ! అని చిరాకుప‌డొచ్చు. అనేకానేక వెర్రి ఆట‌లు, కాంపిటీష‌న్ల‌లో ఇదోటి! విదేశాల్లో గిన్నిస్బుక్ రికార్డుల కోసం చిన్న చిన్న విష‌యాల్లోనూ పెద్ద పెద్ధ పోటీలు జ‌రుగుతుంటాయిట‌. తిన‌డం, ర‌న్నింగ్‌, బ‌స్కీలు తీయ‌డం.. ఇలాంటివి. మ‌రి మ‌న‌వాళ్లు క‌నుగొన్న ఈ పోటీ కూడా ఆ స్థాయికి అను మ‌తి ల‌భిస్తుందేమో చూడాలి!  చిత్రంగా ఉంది గ‌దా. ఈమ‌ధ్య‌నే సూర‌త్‌లో ఈ పోటీ జ‌రిగితే పెద్ద సంఖ్య‌ లో ఎవ్వ‌రూ పాల్గొన‌లేదు. కానీ విన్న‌వారు ప‌డి ప‌డి న‌వ్వుకుంటూనే ఉన్నారు! ఇలాంటి పోటీలూ ఉంటా యా అని!  ఇదే కాదు త్రేణుపుల పోటీ కూడా ఉంటుంది. అయితే దీనికి మాత్రం మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తుం ది. త్రేణుపులు అంత సుల‌భంగా రావు క‌దా!  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu