నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్
posted on Jul 1, 2025 9:25PM

కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరైంది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో భాగంగా వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఉన్నారు. దాంతో ఇప్పటివరకూ వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ మంజూరైనట్లయ్యింది. రేపు వల్లభనేని వంశీ జిల్లా జైలు నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే వంద రోజులకు పైగా వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీ ఉన్నారు. గత నెలలో రెండు కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరు కాగా, తాజాగా నేడు ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ మంజూరైంది. దాంతో వంశీపై పెట్టిన కేసులన్నింటిల్లోనూ బెయిల్ మంజూరైంది. మొత్తం అన్ని కేసుల్లోనూ వంశీకి బెయిల్ లభించడంతో రేపు(బుధవారం) జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.