హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వర్షం.. స్తంభించిన ట్రాఫిక్

 

హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో రాజధాని నగరంలో జనజీవనం అస్థవ్యస్థంగా మారింది. పలు ప్రాంతాల్లో డ్రైన్లు పొంగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, మణికొండ, బంజారా హిల్స్, పంజాగుట్ట, బల్కంపేట, బేగంపేట్, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, కూకట్ పల్లి, గచ్చీబౌలి, టోలీచౌకీ, మెహదీపట్నం, సైనిక్ పురి, సికింద్రాబాద్, వనస్థలిపురం, మియాపూర్, తార్నాక తదితర ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం నుంచీ ఎడతెరిపిలేకుండా ఒక మోస్తరు నుంచి కుండపోత కురుస్తోంది. 

రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఉద్యోగులు ఆఫీసులు నుంచి ఇంటి వెళ్లే పీక్ అవర్స్‌లో వర్షం పడటంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ సిబ్బందికి అధికారులు సూచించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu