వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
posted on May 24, 2025 6:31AM
.webp)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో సారి అస్వస్థతకు గురయ్యారు. బాపులపాడు మండలంలో వెలుగు చూసిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసుకు సంబంధించి ఆయన్ను విచారణ నిమిత్తం విజయవాడ జిల్లా జైలు నుంచి కంకిపాడు పోలీసులు శుక్రవారం ( మే 23) కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు, వంశీని రెండు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. పోలీసుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, రెండు రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. దీంతో అధికారులు ఆయన్ను కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కంకిపాడు పోలీసు స్టేషన్ లో పోలీస్ కస్టడీలో వల్లభనేని వంశీ . వంశీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, వాంతులు చేసుకోవడంతో ఆయనను పోలీసులు హుటాహుటిన కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. గతంలో కూడా వంశీ రెండు సార్లు ఇదే సఃమస్యతో ఇబ్బంది పడటంతో విజయవాడ జిల్లా జైలు నుంచి ఆయనను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించిన సంగతి తెలిసిందే.