హెలికాప్టర్ ప్రమాదంలో అనంతపురం ఎంపీ సోదరి మృతి
posted on May 8, 2025 3:07PM

ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లా గంగ్నాని వద్ద హెలికాప్టర్ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి పెరిగింది. మృతుల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోదరి కూడా ఉన్నట్టు గుర్తించారు. మరణించిన వారిలో ఏపీకి చెందిన వేదవతి కుమారి, విజయారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. వేదవతి భర్త భాస్కర్‌కు ప్రమాదంలో గాయాలయ్యాయి.
అతడిని రుషికేశ్ లోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం పర్యాటకులతో వెళ్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.