ప్రవాస భారతీయులకు లైఫ్‌లాంగ్ వీసాలు.. మోడీ
posted on Sep 29, 2014 11:26AM
.jpg)
ప్రవాస భారతీయులకు భారత మోడీ వరాలు ప్రకటించారు. ప్రవాస భారతీయులకు జీవితకాలం వీసాలు ఇస్తానని మోడీ ఈ సందర్భంగా ప్రకటించారు. భారత సంతతికి చెందినవారు పోలీసులకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. అమెరికాలోని భారత యంత్రాంగాలు అమెరికా పౌరులకు దీర్ఘకాలిక వీసాలను ఇస్తాయని, భారతదేశం వచ్చిన తర్వాత అమెరికా పర్యాటకులకు వీసాలు ఇస్తామని ఆయన చెప్పారు. ఆన్‌లైన్ వీసాల విధానాన్ని ప్రవేశపెడుతామని, ప్రస్తుత సమస్యలను పరిష్కరించడానికి వీసా ఔట్‌సోర్సింగ్‌ను విస్తరిస్తామని నరేంద్ర మోడీ చెప్పారు. ప్రవాస భారతీయులు భారతదేశంపై ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారని, భారతదేశంలో కూడా ప్రజలు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ప్రజల కలలను, ఆకాంక్షలను అన్నిటినీ తన హయాంలోనే నెరవేరుస్తామని హామీ ఇస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు.