చికెన్ తింటున్నాడని విడాకులు...
posted on Apr 22, 2017 4:35PM

ఈ మధ్య చంపడానికే చాలా సిల్లీ రీజన్స్ వింటున్నాం.. అలాంటిది విడాకులు ఓ లేక్కా. ఇప్పుడు అలాంటి ఘటనే చోటుచేసుకుంది. జస్ట్ చికెన్ తింటున్నాడని చెప్పి ఓ యువతి తన భర్తకి విడాకులు ఇచ్చింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉండే జైన మతానికి చెందిన రీమా అనే యువతి బీహార్‌కు చెందిన కరణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆమె జైన మతస్తురాలిని కాబట్టి మాంసాహారం తినదు. తనతో పాటు తన భర్త కూడా మాంసాహారానికి దూరంగా ఉండాలని ఆమె కోరుకుంది. అందుకు అతను కూడా ఒప్పుకున్నాడు. అయితే అప్పుడప్పుడు బయటకు వెళ్లి చికెన్ తిని ఇంటికి వచ్చేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడేవి. ఆ నేపథ్యంలోనే రీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తన భర్త తనకు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోవడం లేదని, మాంసాహారం తింటున్నాడని.. తనకు విడాకులు కావాలని కోర్టు కెక్కింది. మరి ఇంత చిన్న కారణానికి కోర్టు విడాకులు ఇస్తుందో..?లేదో..? చూద్దాం..