యూరియా కొరతపై రైతులకు మంత్రి తుమ్మల బహిరంగ లేఖ

 

రాష్ట్రంలో యూరియా కొరతపై వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రైతాంగానికి బహిరంగ లేఖ రాసారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే రాష్ట్రంలో యురియా కొరత ఏర్పడిందంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలో కేంద్రం ఘోరంగా విఫలమైందని లేఖలో తుమ్మల ఆరోపణలు చేసారు. మరోవైపు యూరియాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణకు 18,900 మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చేనందుకు నిర్ణయం తీసుకుంది. 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 4 రాష్ట్రాలకు 30,491 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇష్యూ చేసింది. బీహార్‌కు 2,700, ఏపీకి 10,800, తెలంగాణకు 8,100, ఒడిశాకు 8,891 మెట్రిక్ టన్నులు కేటాయింపులు చేసింది. తద్వారా యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఉపశమనం లభించనుంది. యూరియా కోసం రైతన్నలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.  ఎరువుల కేంద్రం వద్ద  రైతులు పెద్ద ఎత్తున చేరుకొని క్యూలో చెప్పులు పెట్టి పడి కాపులు కాశాస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu