ఏపీ, తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు

 

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో రెండ్రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో నేడు అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొన్నాది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. 

విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి మోస్తరు నుంచి భారీ వాన పడుతోంది. అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు మోస్తరు వర్షసూచన చేసింది. రేపు (బుధవారం) విశాఖపట్నంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ విభాగం పేర్కొంది విశాఖలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ విభాగం పేర్కొంది.

 శ్రీకాకుళంలో ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ మొత్తం వర్షపు నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు అరకు ఏజెన్సీలోనూ భారీ వర్షం కురుస్తుండటంతో చాపరాయి సందర్శనను నిలిపివేశారు. 

ఇటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. భద్రాది కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొన్నాది. ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu