పొగాకు వాడొద్దు.. బాధ పడొద్దు: మోడీ సందేశం
posted on Jun 1, 2014 12:04PM
.jpg)
ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని నిర్వీర్యం చేసే అంశాల్లో పొగాకు కూడా ఒకటి. పొగాకు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా ఎన్నో కోట్ల మంది మరణిస్తున్నారు. ఏ రూపంలో వాడినా పొగాకు మనిషి జీవితాన్ని కబళిస్తూనే వుంది. అయితే పొగాకును పూర్తిగా నిషేధించే పరిస్థితులు లేవు. పొగాకు వాడకం మీద ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తప్ప మరో మార్గం లేదు. మన భారతదేశంలో పొగాకు కారణంగా జనం ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో క్యాన్సర్ మహమ్మారి విస్తరించడానికి పొగాకు ప్రధాన కారణంగా వుంటోంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ పొగాకు వినియోగాన్ని మానుకోవాలని జాతికి పిలుపు ఇచ్చారు. శనివారం నాడు పొగాకు వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని ఆయన దేశ ప్రజల్ని పొగాకు విషయంలో చైతన్యవంతులను చేయాలని భావించారు. అందుకే ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘పొగాకు వాడకం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యల విషయంలో ప్రజలకు అవగాహన పెంచుదామని ప్రతిజ్ఞ చేద్దాం’ అని ట్విట్ పోస్ట్ చేశారు. మోడీ చెప్పినట్టు విందాం. ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని కాపాడుకుందాం.