యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ..కేంద్రం క్లారిటీ

దేశంలో ఇకనుంచి రూ.2 వేలకు పైగా చేసే అన్ని రకాల యూపీఐ పేమెంట్స్ మీద కేంద్ర ప్రభుత్వం 18% జీఎస్టీ విధించనున్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. అన్ని నిరాధార, తప్పుడు దోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనమే లేవని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.  శుక్రవారం కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఈ కథనాలను ప్రసారం చేయగా ఆర్థిక శాఖ స్పందించింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏవీ లేవని, చిన్న చిన్న చెల్లింపులపై ఎటువంటి టాక్స్ లు విధించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.

దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దేశంలో యూపీఐ పేమెంట్స్‌ ప్రోత్సహించేందుకు ఎన్డీయే సర్కార్ కట్టుబడి ఉందని ప్రకటించింది. అందర్నీ ప్రోత్సహించేందదుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం యూపీఐ లావాదేవీలపై నేరుగా జీఎస్టీ వేయడానికి వీలు లేదు. యూపీఐ అనేది ఒక మాధ్యమం అని పేర్కొంది