ఏపీలో పాస్టర్లకు వేతనలు ప్రకటించటంతో..జగన్ వ్యూహానికి చెక్

 

గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వం  గౌరవ వేతనం చెల్లించడానికి రూ.30 కోట్లు విడుదల చేసింది. పాస్టర్లకు ఏడు నెలల పాటు మే 2024 నుండి నవంబర్ 2024 వరకు నెలవారీ గౌరవ వేతనం చెల్లించాలని మైనారిటీల సంక్షేమ శాఖ ప్రభుత్వ ఉత్తర్వు  జారీ చేసింది. ఈ ఏడు నెలల కాలానికిగాను రూ. 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్‌కు రూ. 35 వేల చొప్పున లబ్ది చేకూరనుంది. 2023 జనవరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే.. గౌరవ వేతనం అందిస్తామని పాస్టర్లకు ఆయన హామీ ఇచ్చారు. 

ఆ క్రమంలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీని అమలు చేసింది. రాష్ట్రంలో ఉన్న చర్చి పాస్టర్లకి ప్రతి నెలా గౌరవ వేతనం కోసం నిధులు విడుదల చేయాలని.. లేకపోతే కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని వైసీపీ అధినేత జగన్ తెలిపిన సంగతి తెలిసిందే. పాస్టర్లకు  గౌరవ వేతనం సీఎం చంద్రబాబు ప్రకటించటంతో ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వం కొట్టేసిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం రాష్ట్రంలో క్రిస్టియన్స్ కూటమి ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదన్ని హత్యగా చిత్రకరించి వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూసింది వారి ఆశలు అడియాశలయ్యాయి. ఏపీలో ఉన్న చర్చి పాస్టర్లకి ప్రభుత్వం ప్రతి నెలా గౌరవ వేతనం ప్రకటించడంతో కూటమి ప్రభుత్వన్నికి క్రైస్తవుల్లో సానుభూతి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు  ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లు వైఎస్ జగన్ వ్యూహానికి చెక్ పెట్టారు.