జనసేన పార్టీ కార్యాలయంపై దాడి

 

గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌లోని ఆఫీస్‌పై మద్యం బాటిళ్ళతో దాడికి తెగపడ్డారు. బీరు సీసాలు విసరడంతో పార్టీ కార్యాలయ అద్దాలు ద్వంసం అయ్యాయి. అంతటితో ఆగకుండా అడ్డువచ్చిన సెక్యురిటి సిబ్బందిపైకి కూడా రాళ్లు విసిరారు. దాడి ఘటనపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో ఎవరు దాడి చేసారో తెలియట్లేదు. అయితే సీసీ కెమేరా విజువల్స్ కోసం పార్టీ నేతలు వెతుకుతున్నారు. ఈ కార్యాలయాన్ని రెండు వారాల క్రితమే పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu