ఉత్తరాంధ్ర కాదు ఉత్తమాంధ్ర.. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వేసిన కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాశుళంలోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మన తరువాతి తరాలకు ఆచార సాంప్రదాయాలను చేరవేసే భాద్యతను ప్రతీ ఒక్కరు తీసుకోవాలని పిలుపునిస్తూ ప్రజలకు   భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

 కూటమి సర్కారు ప్రజారంజక పాలనలో ప్రతీ పల్లెలో సంక్రాంతి శోభ మెండుగా కనిపిస్తోందని, ప్రతీ ఇంట సిరుల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయన్న ఆయన  పుట్టిన ఊరికి పంచే మమకారమే నిజమైన సంక్రాంతి అన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో ఇబ్బందులు లేని వ్యవసాయాన్ని అన్నదాతలు చేస్తున్నారని, ధాన్యం కొనుగోళ్ళ విషయంలో ఎలాంటి జాప్యం, ఇతరుల ప్రమేయం లేకుండా సక్రమంగా చెల్లింపులు సత్వరం జరుగుతున్నాయనీ, ప్రధాని మోదీ తోడ్పాటుతో ఉత్తరాంధ్రను ఉత్తమాంధ్రగా మార్చే కీలక ప్రాజెక్టులు మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.  

భోగాపురం విమానాశ్రయాన్ని జూన్ కన్నా ముందే ప్రారంభిస్తామని స్పష్టం చేసిన రామ్మోహన్ నాయుడు.. దానికి అనుసంధానంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి సరికొత్త ఉత్తరాంధ్ర సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu