అమ్మాయిలు రాత్రుళ్లు ఎందుకు తిరగాలి.. మంత్రి
posted on Sep 19, 2015 3:34PM

రాజకీయ నాయకులు అప్పుడప్పుడు మహిళలపై వ్యాఖ్యలు చేస్తూ బుక్ అవుతూ ఉంటారు. తాజాకా కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి మహేష్ శర్మ అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలకు విమర్శలు తలెత్తున్నాయి. ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఈయన అమ్మాయిలను ఉద్దేశించి అమ్మాయిలు రాత్రిపూట తిరగడం వేరే దేశాల్లో తప్పుకాదేమో కాని అది మన సాంప్రదాయం కాదు.. భారతీయ సంస్కృతిలో మాత్రం అది భాగం కాదు'.. అసలు అమ్మాయిలు రాత్రిపూట రోడ్డుపై ఎందుకు తిరగాలి.. అసలు తిరిగే అంత అవసరం ఏముంటుంది అని వ్యాఖ్యానించారు. అంతేకాదు జైనుల పండుగ సందర్భంగా కూడా ఆయన మాట్లాడుతూ జైనులను గౌరవించేలా కొద్దిరోజులు మాంసానికి దూరమైతే తప్పేంటి.. కొన్ని రోజులు తినకుండా ఉండగలరా అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు తలెత్తుతున్నాయి. కాగా ఈయన గతంలో కూడా మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాంపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.