కేసీఆర్ ఇందులో పోటీపడు
posted on Sep 19, 2015 4:42PM

టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ కేసీఆర్ ప్రభుత్వ విధానంపై మరోసారి మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతుల రుణమాపీ చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందుందని.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వెనుకబడి ఉందని అన్నారు. ఒకపక్క ఏపీ ప్రభుత్వం చేసిన రుణమాఫీలు రైతులకు ఊరట నిస్తుంటే మరోపక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రైతు రుణమాఫీలు లేక.. రైతులు ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకోవాల్సి పరిస్థితి వస్తుందంటూ ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్ టూర్లు అంటూ పర్యటిస్తున్నారు.. కానీ వాళ్ల గురించి ఆలోచించడంలేదని అన్నారు. కేసీఆర్ చేసిన హామీలన్నీ నెరవేర్చాలని.. రైతుల రుణమాఫీ చేయాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు ఏపీ ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంటే.. మరి అన్నింటిలో పోటీపడే కేసీఆర్ ఈవిషయంలో మాత్రం ఎందుకు ఎక్కువ పరిహారాన్ని ఇవ్వడంలేదు.. రైతు కుటుంబాలకు పదిలక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తమ పోరాటం వల్లే చీఫ్ లిక్కర్ పై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని చెప్పారు.