నేనా...పార్టీ మారడమా? నో ఛాన్స్
posted on Sep 19, 2015 3:00PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు ప్రకాశం జిల్లా టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, బతికున్నంత వరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని స్పష్టంచేశారు. కొంతమంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆయన, ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీ మారడం జరగదన్నారు. అయితే కొంతకాలంగా హైకమాండ్ తీరుపై కరణం బలరాం అసంతప్తితో ఉన్నారనే టాక్ వినిపించింది, పార్టీనే నమ్ముకుని ఉన్న తనను కాదని, ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నారట. ఈ నేఫథ్యంలోనే వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారే ప్రసక్తే లేదని కరణం బలరాం తేల్చిచెప్పడంతో ఊహాగానాలకు తెరపడినట్లయింది.