పెంపుడు కుక్క‌ను క‌లిసిన ఉక్రెయిన్ కుటుంబం

కుక్క‌ల‌కు మ‌నిషికి స్నేహ‌బంధం అనాదిగా వుంది. పెంపుడు కుక్క‌కు య‌జ‌మానిప‌ట్ల ఉండే విధేయ‌త‌కు గొప్ప సాక్ష్యం కేథ‌రినా త్యోవా కుటుంబమే. ర‌ష్యా ద‌ళాలు ఉక్రెయిన్‌పై దాడులు జ‌రిపిన‌ పుడు త్యోవా కుటుంబం కూలిపోయిన ఇంటిని విడిచి దూరంగా వెళ్ల‌వ‌లసి వ‌చ్చింది. నాలుగు నెల‌ల త‌ర్వాత యుద్ధ‌వాతావ‌ర‌ణం త‌గ్గేస‌రికి తిరిగి వ‌చ్చింది. చిత్రంగా వారి పెంపుడు కుక్క వారి కోసం ఆ శిధిలాల వ‌ద్దే ఎదురుచూస్తూ క‌న‌ప‌డింది. 

ఉత్త‌ర ఉక్రెయిన్ లోని కీల‌క విమానాశ్ర‌యం వున్న హోస్తోమెల్‌పై ర‌ష్యా దాడి చేసింది. ఆ ప‌ట్ట‌ణంలో 35 సంవ‌త్స‌రాల బంగారం వ్యాపారి త్యోవా ఆమె కుటుంబం భ‌య‌ప‌డి ప‌ట్ట‌ణం విడిచి వెళ్లాల‌నుకున్నారు. ఆమె త‌న భ‌ర్త అలెగ్జాండ‌ర్‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో వెళి పోయారు. కానీ వారు ఆ భ‌యాందోళ‌న‌ల్లో వారి పెంపుడు కుక్క సైబేరియ‌న్ హ‌స్కీని వ‌దిలేశారు. ఎంత నిర్దాక్షిణ్యంగా వ‌దిలే శారు.. అనుకోవ‌చ్చు. అయినా వారికి అది త‌ప్ప‌ని ప‌రిస్థితి. కానీ హ‌స్కీ త‌ప్ప‌కుండా త‌మ కోసం ఎదురుచూస్తుంటుంద‌ని త్యోవా న‌మ్మింది. కానీ వారికి ఆ త‌ర్వాత నుంచి తెలిసిన వార్త‌ల అనుస‌రించి వారి ప్రాంతం అంతా రాళ్ల గుట్ట‌లుగా మారింద‌ని. దాంతో త్యోవాకు హ‌స్కీ గురించిన బెంగ ప‌ట్టుకుంది. మ‌ధ్య  ఉక్రెయిన్ ప్రాంతంలోని  వినిత్సాలో త‌మ స్నేహితుల ఇంట్లో త్యోవా కుటుంబం త‌ల‌దాచుకుంది. 

తొమ్మిదేళ్ల హ‌స్కీ మాత్రం అక్క‌డే ఆ శిధిలాల‌మ‌ధ్య తిరుగుతూ ఆ కుటుంబంతో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అటూ ఇటూ చూస్తూ, రాళ్ల‌మ‌ధ్య దొరికిన‌ది తింటూ రోడ్డుమీద‌కి వ‌స్తూ పోతూ బేల‌గా చూస్తూ నాలుగు నెల‌ల గ‌డిపింది. నాలుగు నెల‌ల త‌ర్వాత ఆ మ‌ధ్య త్యోవా కుటుంబం త‌న ప‌ట్ట‌ణానికి వ‌చ్చింది. ఆమెకు ముందుగా స‌గం కూలిన ఇల్లు కాకుండా హ‌స్కీ బ‌తికే వుందో లేదో చూడాల‌ని ఇంటివేపు కూతురుతో పాటు ప‌రుగులు తీసింది. కొద్దిదూరంలో హ‌స్కీ త‌న య‌జమానురాలు రావ‌డం చూసి ప‌రుగు ప‌రుగున వెళ్లి కాళ్ల‌ను చుట్టేసింది. దాని ఆనందానికి అంతేలేదు. త్యోవాకు గుండె భారం త‌గ్గింది. అమాంతం దాన్ని ఎత్తుకుని ముద్దుల‌తో ముంచెత్తింది. త్యోతా ఐదేళ్ల కూతురు త‌జిసియా అయితే హ‌స్కీని ఎత్తుకుని ప‌రుగులు తీసింది, ఆడింది, దాని తోక లాగి హ‌స్కీ ఆట‌పట్టించింది. హ‌స్కీ మాత్రం త‌జిసియా పాదాలు నాకి న‌న్నొద‌ల‌ద్ద‌న్న‌ది!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu