టీచర్లు కాదు.. కామ పిశాచులు...

 

మన ఇండియాలో మగ టీచర్లు తమ విద్యార్థుల మీద లైంగిక దాడులకు పాల్పడుతూ వుంటారు. అయితే అమెరికాలో మాత్రం ఈమధ్య కాలంలో మరో రకంగా జరుగుతోంది. వివిధ స్కూళ్ళలో టీచర్లుగా పనిచేస్తున్న యువతులు తాము పాఠాలు చెప్పే కుర్రాళ్ళను ముగ్గులోకి దించుతున్నారు. వారిని తమ లైంగిక అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇలాంటి కేసులు అమెరికాలో బాగా పెరిగిపోయాయి. మొన్నీమధ్యే ఇలాంటి చర్యకు ఒక టీచర్ని అరెస్టు చేశారు. ఇప్పుడు కాలిఫోర్నియాలోని ఓ హైస్కూల్లో పనిచేస్తున్న ఇద్దరు టీచర్లు ఇలాంటి పనికే ఒడిగట్టారు. అయితే వీళ్ళు కూడా దొరికిపోయి ఇప్పుడు కటకటాల వెనుక వున్నారు. మూడు పదుల వయసున్న మిచేలీ, గిరెల్లీ అనే ఇద్దరు టీచర్లను వాళ్ళు పనిచేసే స్కూలు యాజమాన్యం విద్యార్థులను బీచ్‌కి విహార యాత్రకు తీసుకెళ్ళాల్సిందిగా ఆదేశించింది. అయితే బీచ్‌లో కొందరు విద్యార్థులతో బీచ్‌లోనే వీళ్ళిద్దరూ శృంగారంలో పాల్గొన్నారని ఆ తర్వాత బయటపడింది. కొంతమంది విద్యార్థులకు బాగా తాగించి ఆ తర్వాత వీరిద్దరూ తాము అనుకున్నది చేశారని తెలుస్తోంది. పోలీసులు ఈ ఇద్దరినీ అరెస్టు చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu