ఇండోనేసియా అధ్యక్షుడిది ఇండియన్ డీఎన్ఏ!
posted on Jan 27, 2025 9:23AM

ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంతో మూలాలు భారత్ లోనే ఉన్నాయా? అంటే ఆయనే స్వయంగా ఔనని చెబుతున్నారు.తనది ఇండియన్ డీఎన్ఏయే అని చెప్పుకున్నారు. అదీ అక్కడా ఇక్కడా కాదు.. భారత్ వేదికగా ఆయనీ ప్రకటన చేశారు. భారత గణతంత్రి దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేసియా అధ్యక్షుడు సుబియాంతో తన ప్రసంగంలో తనలో భారతీయ మూలాలున్నట్లు ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆ విషయం వెల్లడైందని చెప్పారు.
అంతే కాదు తనకు సంగీతం పట్ల ఉన్న అభిరుచి, భారతీయ సంగీతం వింటే తాను హుషారుగా, ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తానని చెప్పుకున్న ఆయన అదీ తన భాతర మూలాల నుంచే వచ్చి ఉండొచ్చని చమత్కరించి నవ్వులు పూయించారు. అంతే కాకుండా భాతర్, ఇండోనేసియా భాషలకు సంస్కృతమే మూలమన్నారు. ఇండోనేసియా, భారత్ సంస్కృతులలో పోలికలు ఉన్నాయన్నారు.
అనంతరం ఆయన రాష్ట్రపతి దౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి దన్కడ్, ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.