నెహ్రూకి మోడీ ట్విట్టర్లో నివాళి

 

భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ 125వ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నాడు ఆస్ట్రేలియాలో ఘనంగా నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ పోషించి పాత్ర అత్యంత కీలకమని మోడీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశానికి విశేష సేవలందించారని నెహ్రూపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. నరేంద్ర మోడీ తన పర్యటనలో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరానికి చేరుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu