పిల్లా నువ్వులేని జీవితం: షార్ట్ - స్వీట్ రివ్యూ

 

బ్యానర్: గీతాఆర్ట్స్

 

నటీనటులు: సాయిధరమ్‌ తేజ్‌, రెజీనా, జగపతిబాబు, చంద్రమోహన్, జయప్రకాష్‌రెడ్డి, దువ్వాసి మోహన్, ప్రభాస్ శ్రీను, సత్యవాణి, రఘుబాబు, రజిత, జోష్ రవి తదితరులు.

 

సాంకేతిక నిపుణులు: సంగీతం:అనూప్ రూబెన్స్, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, భాస్కరభట్ల, సుద్దాల అశోక్ తేజ, కెమెరా: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:డైమండ్ రత్నం, వేమారెడ్డి, నిర్మాతలు: బన్నివాసు, హర్షిత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఎస్.రవికుమార్ చౌదరి.

 

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా శుక్రవారం నాడు విడుదలైంది. సాయి ధరమ్ తేజ్‌కి ఇది మొదటి సినిమా. రెజీనా హీరోయిన్‌గా నటించింది. మైండ్ గేమ్ ప్రధానంగా సాగే కథతో రూపొందిన సినిమా ఇది. ఫస్టాఫ్ అంతా ఫన్‌తో నడిచింది. సినిమా చివరి వరకు విలన్ ఎవరో తెలియని సస్పెన్స్ ఆకట్టుకునేలా వుంది. సినిమా చివర్లో విలన్‌కి బుద్ధి చెప్పే సన్నివేశాలు కామెడీగా, వైవిధ్యంగా వున్నాయి. ఓ అనాధ కుర్రాడు శ్రీను (సాయి ధరమ్ తేజ) సిరి (రెజీనా)ప్రేమలో పడిపోతాడు. ఆమె వెనక పడతాడు. ఈ ప్రయత్నాల్లో ఆమెకు కుటుంబపరంగా ఓ సమస్య ఉందని, ఆమెను హత్య చేసేందుకు మైసమ్మ (జగపతిబాబు) అనే కిల్లర్‌కిసుపారీ ఇచ్చారని తెలుసుకుంటాడు. దాంతో ఆ అమ్మాయి లేకపోతే జీవితమే లేదు అనుకునే ఈ కుర్రాడు ఆమెను ఎలా రక్షించాడనేది కథ. సాయి ధరమ్ తేజ్ కొత్త హీరో అయినా మంచి ఈజ్‌తో నటించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu