నటిని గోకాడు.. నటుణ్ణి లోపలేశారు!
posted on Jul 2, 2014 10:35AM

అతడో నటుడు. సినిమాల్లో, సీరియళ్ళలో చిన్న చిన్న కేరెక్టర్లు చేస్తూ వుంటాడు. ఆమె ఓ నటి. ఆమె కూడా సినిమాల్లో చిన్నా చితక పాత్రల్లో నటిస్తూ వుంటుంది. వీరిద్దరికీ ఎంతోకాలం నుంచి పరిచయం వుంది. ఆమెతో తనకున్న పరిచయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని సదరు నటుడు అనుకున్నాడు. ఆమె మీద వున్న తన కోరికని ఆమె దగ్గర వ్యక్తం చేశాడు. ఆమె అతని కోరికను తిరస్కరించింది. అయితే ఆ నటుడు ఆ విషయాన్ని అక్కడితో వదిలేయకుండా ఆమెని వేధించడం ప్రారంభించాడు. అయితే అతను ఎంత వేధిస్తున్నా ఆమె ఇంతకాలం మౌనం వహించింది. అయితే మంగళవారం నాడు సదరు నటుడికి పైత్యం పతాకస్థాయికి చేరుకుంది. డైరెక్టుగా ఆమె ఇంట్లోకే వెళ్ళి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సదరు నటుడి ఓవర్ యాక్షన్‌ని ప్రత్యక్షంగా చూశారు. ప్రస్తుతం సదరు నటుణ్ణి లాకప్‌లో వేసి కోటింగ్ ఇస్తున్నారు.