అందులో నిజం లేదు - తులసి రెడ్డి

 

 

రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎవరితో జట్టు కడతారో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్, టీడీపీ కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీ లో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఉందని అంతా అనుకున్నారు. ఈ ఉహాగానాలకు తెరదింపుతూ కాంగ్రెస్ పార్టీ నేత తులసి రెడ్డి ప్రకటన విడుదల చేసారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు అవాస్తవమని స్పష్టం చేసారు. ఎన్నిలకోసమే అసత్య ప్రచారం చేస్తున్నాయని, ఎన్నికల తర్వాత టీడీపీ,వైసీపీ పార్టీలు బీజేపీ లో చేరుతాయన్నారు. టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీ అని,వైసీపీ నకిలీ, కబ్జాకోరు పార్టీ అని తులసి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu