తిరుమల ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం

 

తిరుమల ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎన్‌ఆర్‌ఐ తోట చంద్రశేఖర్‌ రూ.కోటి విరాళం అందించారు. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ను బీఆర్‌ నాయుడు అభినందించారు.మరోవైపు అమలాపురం వాసి నిమ్మకాయల సత్యనారాయణ టీటీడీకు 2వేల హెల్మెట్లను అందించారు. తిరుమల ఛైర్మన్‌ను కలిసి రూ.15లక్షల విలువైన హెల్మెట్లను విరాళంగా అందజేశారు. 

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న స్వామివారిని 75,001 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల కానుకల ద్వారా శ్రీవారికి 3.67 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలకు భక్తుల రద్ధీ తగ్గినట్లు తెలుస్తోంది. బుధవారం అమావాస్య కావడంతో ప్రజలు తమ ప్రయాణాలు నిలిపివేసుకుంటారు. దీంతో గురువారం తెల్లవారుజామున తిరుమల కొండపై భక్తుల రద్ధీ భారీగా తగ్గిపోయింది.