గచ్చిబౌలి‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య

 

హైదరాబాద్ గచ్చిబౌలి‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నిఖిల్ మదన్ 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు. తీవ్ర గాయాలతో నిఖిల్ మదన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.  మృతునికి తొమ్మిది నెలల క్రితం పెళ్లి జరిగింది. ఆయన భార్య ప్రేరణ టీవీ చూస్తుండగా తాను ఉంటున్న 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు. మానసిక కుంగుబాటే కరణమని పోలీసులు అనుమానిస్తున్నరు.