ఇస్లామిక్ తీవ్రవాదంతో పాటూ ఇండియన్ ఐటీపై దృష్టి పెట్టాడు!


ట్రంప్ సెగ మెల్ల మెల్లగా ఒక్కొక్కరికీ తగులుతున్నట్టు కనిపిస్తోంది. వైట్ హౌజ్ లో కాలుమోపపటంతోనే మెక్సికో పై బడ్డ ఆయన గోడ కడతానని అన్నంత పనీ చేశాడు. మెక్సికో సరిహద్దులో గొడ కట్టడం ప్రారంభించాలని ఆర్డర్ వేశాడు! అది చాలదన్నట్టు ఏడు దేశాల ముస్లిమ్ లను అమెరికాలోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దాని వల్ల ఇంటా, బయటా వ్యతిరేకత వచ్చినా డోంట్ కేర్ అంటున్నాడు. సాక్షాత్తూ అటార్నీ జనరల్ ఆఫ్ అమెరికా తనని వ్యతిరేకిస్తే ఆమెని కూడా పోస్టులోంచి పేకాశాడు ట్రంప్. ఎన్నికల ముందు అన్నవన్నీ చేస్తూ చాలా మందికి వెన్నులో వణకు పుట్టిస్తున్నాడు. అలా ట్రంప్ హిట్ లిస్ట్ లో ఇండియన్ ఐటీ దిగ్గజాలు కూడా చేరియాపోయాయి... 


అమెరికాలో ఉద్యోగాలు మొదట అమెరికన్స్ కే చెందాలి. ఇది ట్రంప్ ఎలక్షన్స్ టైంలో పదే పదే చెప్పిన మాట. అందుకోసం ఏం చేయాలో ట్రంప్ చేయటం మొదలెట్టాడు. హెచ్ వన్ బీ వీసాల జారీకి సంబంధించి నిబంధనలు మార్చేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. బిల్లు చట్ట సభ దాకా వెళ్లిపోయింది కూడా!


తాజా హెచ్ వన్ బీ వీసాల బిల్లు అమోదం పొందితే ఇండియన్ ఐటీ కంపెనీలకు పెద్ద ఇబ్బందే వస్తుంది. హెచ్ వన్ బీ వీసా ఇచ్చేందుకు కనీస జీతం 60వేల డాలర్లుగా వుండేది ఇప్పటిదాకా. కాని, ట్రంప్ కొత్త నిర్ణయం మేరకు ఒక లక్ష ముప్పై వేల డాలర్లు అవ్వనుంది. అంటే డబుల్ సాలరీ పెంచాలన్నమాట. తమ పాత ఉద్యోగులకి అంతగా జీతాలు పెంచి కంపెనీలు వార్ని ఉద్యోగాల్లో వుంచుకుంటాయా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నే. ఒక వేళ ఆ కంపెనీలు భారీగా జీతాలు ఇచ్చి ఇండియన్స్ ని పెట్టుకోవద్దని నిర్ణయిస్తే చాలా మందికి ఉద్యోగాలు ఊడే అవకాశం వుంది. కాని, అదే సమయంలో నిజంగా అద్భుతమైన టాలెంట్ వున్న వారికి జీతాలు అమాంతం పెరిగిపోయి అభివృద్ధి కనిపించే ఛాన్స్ వుంది. 


ట్రంప్ వీసాల జారీని క్లిష్టతరం చేయటం అమెరికన్స్ కి ఎంత వరకూ లాభిస్తుందో తెలియదుగాని ... లక్షలాది మంది మన వారు మాత్రం అమెరికాలో ఆశ్రయం పొందటం ఇక మీద కష్టమైపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇండియా నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఐటీ కంపెనీలు తమ బిజినెస్ ఫార్మాట్ మార్చుకోవాలి. ట్రంప్ నియమ, నిబంధనలు పాటిస్తూనే ఎట్లా కాస్ట్ కంట్రోల్ చేయోచ్చో గ్రహించాలి. ఆఫ్ట్రాల్, ప్రతీ సమస్యకూ ఏదో ఒక పరిష్కారం వుండే తీరుతుంది కదా... 



 
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu