ఎస్సార్సీతో రాజీ పడం : కోమటిరెడ్డి

హైదరాబాద్ : టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సమావేశం గురువారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరయ్యారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. దాంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే  కోమటిరెడ్డి ప్రత్యేక తెలంగాణ సాధనే అంతిమ లక్ష్యమని రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంటకరెడ్డి పునరుద్ఘాటించారు. ఎస్సార్సీ, ప్యాకేజీలతో రాజీపడబోమని ఆయన స్పష్టం చేశారు. నిమ్స్ నుంచి ఆయన గురువారం డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా కేంద్రం త్వర లోనే ప్రకటన చేస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తొమ్మిది రోజుల పాటు నిరాహారదీక్ష చేసిన తనను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కనీసం ఫోన్ ద్వారా  కూడా పరామర్శించలేదన్నారు.

కాగా ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణపై అధికారికంగా మాట్లాడాల్సింది సోనియా, చిదంబరం, ఆజాద్‌లేనని  అన్నారు. దిగ్విజయ్ సింగ్, రషీద్ ఆల్వి వ్యాఖ్యలను పట్టించుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, కమలాకర్‌లతో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో  మాట్లాడారు. ఎస్సార్సీ వేస్తే కాంగ్రెస్‌ను వీడే అంశంపై తెలంగాణ నేతలందరం కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటామని పొన్నం తెలిపారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu