'కెసిఆర్ కాంగ్రెసుతో కుమ్మక్కవడం వల్లనే..'
posted on Nov 10, 2011 2:19PM
హైదరా
బాద్: కెసిఆర్‌కు తెలంగాణ రావడం ఇష్టం లేదని, తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకొని సంపాదనకు అలవాటు పడ్డారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గతంలో శ్రీకృష్ణ కమటికి, ఇప్పుడు రెండో ఎస్సార్సీకి కెసిఆర్ లోలోన మద్దతు పలుకుతూ బయటకు మాత్రం వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. రెండో ఎస్సార్సీ టిఆర్ఎస్‌కు తెలియకుండా వేస్తారని తాను అనుకోవడం లేదన్నారు.
కాంగ్రెసుకు, టిఆర్ఎస్‌కు మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, తెలంగాణ తెలుగుదేశం ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఉదయం కెసిఆర్‌పై విరుచుకు పడిన విషయం తెలిసిందే. కెసిఆర్ కాంగ్రెసుతో కుమ్మక్కవడం వల్లనే రెండో ఎస్సార్సీ తెరపైకి వచ్చిందని ఆయన అన్నారు.