టిఆర్ ఎస్, బీజేపీ ట్వీట్ వార్‌!

తిట్టుకోవ‌డానికి, విమ‌ర్శ‌లు చేసుకోవ‌డానికి ఇపుడు రాజ‌కీయ‌నాయ‌కులు  ట్విట‌ర్‌ను వేదిక చేసుకున్నా రు.  రోడ్లు మీద‌కి వ‌చ్చి మ‌రీ బ‌జారు రౌడీల్లా తిట్టుకోవ‌డం కాకుండా టెక్నాల‌జీని బాగా వినియోగించు కుంటున్నారు. ట్విట‌ర్‌లో  అభిప్రాయాలు, విమ‌ర్శ‌ల‌తో  అధికార‌, విప‌క్షాల నాయ‌కులు  విమ‌ర్శ‌ల దాడికి  దిగారు.  ము ఖ్యంగా ప్ర‌ధాని మోదీ, తెలంగాణా సీఎం కేసీఆర్ ఫోటోల గురించి ఆ రెండు పార్టీల నాయ‌కులు మ‌రీ రెచ్చిపోతున్నారు. 

కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామన్  తెలంగాణా  ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఒక గ్రామంలో  ప‌ర్య‌టించిన‌పుడు  ఒక రేష‌న్ దుకాణా నికి వెళ్లి ప్ర‌ధాని మోదీ ఫోటో లేక‌పోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం కొంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రి చింది, చాలామందికి మ‌రీ కామెడీగా అనిపించింది. 

బీజేపీ నేత‌లు  ఏదో విధంగా రాష్ట్రంలో కేసీఆర్ ప్ర‌భుత్వం, నాయ‌కుల మీద విమ‌ర్శ‌లు గుప్పించ‌డం అల‌వాటుగా చేసుకున్నారు. ఆమె ఆ విధంగా అన‌డంతో తెలంగాణా మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. తెలంగాణాలో ఒక గ్రామంలో సిలెండ‌ర్ల మీద మోడీ బొమ్మ‌తో సిలెండ‌ర్లు కొన్ని రిక్షాలో వెళుతూండ‌డం క‌న‌ప‌డుతుంది. ఆ సిలెండ‌ర్ మీద ధ‌ర రూ.1105 అని ఆ ప‌క్క‌నే మోదీ బొమ్మ ఉంది.  బీజేపీవారు గొంతు చించుకున్న‌ట్టే మేము ప్ర‌ధానికి గౌర‌వం ప్ర‌ద‌ర్శించామ‌న్నారు. 

దీనికి ఓ అభిమాని ఇలా స‌మాధానం పెట్టాడు.. నిర్మ‌లాజీ, మీరు కంగారుప‌డ‌కండి.. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ లు  సిబిఐ,ఈడీ , ఐటీ  సంస్థ‌ల‌కీ మోదీజీ ఫోటో పెట్టేస్తే మీరు క‌ష్ట‌ప‌డి ఎవ‌రినీ మోదీజీ ఫోటో పెట్ట‌మ‌ని ప్ర‌చారం చేయ‌న‌వ‌స‌రం లేదేమో అని !

ఇదిలాఉండ‌గా, ఇటీవ‌లే బీజేపీ పార్టీలో చేరిన కోమ‌టిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి టీఆర్ ఎస్ మీద మ‌రింత వెట‌కారంగా ట్వీట్ చేశారు. ప్రతి రేషన్ షాపులో ప్రధాని ఫోటో పెట్టిన పెట్టక పోయినా పర్వాలేదు ఎందుకంటే ప్రధాని తెలంగాణ ప్రజా గుండెల్లో ఉన్నారని అన్నారు. 

తెలంగాణలో ప్రతి వైన్ షాపులో కెసిఆర్ ఫోటో పెట్టాలని, ప్ర‌తీ మందు బాటిళ్లు పైన పింక్ లేబుల్ వెయ్యాలన్నారు. అంతేకాదు ఢిల్లీలో కూడా ప్రతి వైన్ షాపులో కేసీఆర్‌, క‌విత ఫోటోలు పెట్టాల‌ని గ‌ట్టిగానే స‌మా ధానం చెబుతూ ఒక ట్వీట్  చేశారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu