బొమ్మ బాంబు బ్లాస్ట్...

 

బొమ్మ బాంబు పేలుడులో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు వారి తండ్రి కూడా హతమయ్యాడు. ఈ దారుణమైన ఘటన పాకిస్తాన్ ఖైబర్ పక్తువ్వా ప్రావెన్స్ స్వాత్ జిల్లా బాషిగ్రామ్ ప్రాంతంలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు చిన్నారులు మొక్కల వద్ద ఉన్న బొమ్మను ఇంటిలోకి తీసుకొచ్చి ఆడుకొంటుండగా బొమ్మ పేలింది. ఈ దుర్ఘటనలో చిన్నారులు, తండ్రి మృతి చెందగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. బొమ్మలో బాంబును అమర్చడం వల్లే ఈ బాంబు పేలుడు సంభవించిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu