కర్నూల్ షిప్టింగ్.. వన్ ఛాన్స్ సీఎం.. పోరు బాట.. బలి తీసుకున్న మాఫియా.. టాప్ న్యూస్@1PM

మూడు రాజధానుల చట్టాన్ని జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. కానీ రాజధానిపై అందరి అనుమానాలు నిజం చేస్తూ.. తాము చేయాలనుకున్నపని చేస్తునే ఉన్నారు. అమరావతిలోని సంస్థలను ఒక్కొక్కటిగా తరలిస్తున్నారు. తాజాగా వక్ఫ్ ట్రైబ్యునల్ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కర్నూలుకు లోకాయుక్త, హెచ్చార్సీ సంస్థలను తరలించింది  జగన్ ప్రభుత్వం.
----
వన్ ఛాన్స్ అంటూ వచ్చి, కలెక్షన్స్ కోసం పేదలను వన్ టైమ్ సెటిల్మెంట్ అంటూ వన్ టైమ్ సీఎంగా జగన్ మిగిలి పోబోతున్నారని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో పేదల ఇళ్ల పైన రుణాలు రద్దు చేస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక ఆ హామీని రద్దు చేశారన్నారు. ఎప్పుడో పుట్టిన పిల్లవాడికి అతని పెళ్లి సమయంలో బారసాల చేసినట్టు జగన్ పాలన తీరు ఉందన్నారు.
--
రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు మంగళవారం ఉదయం తమ ఉద్యమాన్ని ప్రారంభించారు. నల్లబ్యాడ్జీలతో  ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.  పీఆర్సీ నివేదిక, ఉద్యోగుల సమస్యలపై ఈనెల 10 వరకు నల్లబ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన తెలుపనున్నారు. ఉమ్మడి జేఏసీలు తలపెట్టిన నిరసనలో భాగంగా ఉద్యోగులు స్వచ్ఛందగా ప్రభుత్వ కార్యాలయాలకు నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలుపుతున్నారు.
-------
తిరుపతి నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ నిరసనకు దిగింది. వరదల వల్ల పారిశుద్ధ్యం లోపించి దోమల బెడద ఎక్కువైందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు అన్నారు. దోమల బెడదతో తిరుపతి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఐ నేతలు నిరసనకు దిగారు. 
------
తూర్పు గోదావరి అయినవిల్లి మండలం ఎంపీడీవో కట్టుపల్లి రాజ విజయను బెదిరించిన వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినవిల్లి మండల జడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాసరావు, ఎన్.పెదపాలెం మాజీ సర్పంచ్ నేదునూరు తాతాజీ, క్రాప శంఖరాయగూడెం మాజీ సర్పంచ్ కుడుపూడి రామకృష్ణ, కె.జగన్నాధపురం గ్రామానికి చెందిన మేడిశెట్టి శ్రీనివాసరావులుపై కేసు నమోదు చేశారు.
-----
తిరుమల శ్రీవారి ఆలయ హుండీలో చోరీకి పాల్పడిన  ఆర్‌.భాస్కర్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తిరుపతి రెండో అదనపు మున్సి్‌పకోర్టు న్యాయమూర్తి పి.కోటీశ్వరరావు తీర్పు చెప్పారు. 2019డిసెంబరు 29న శ్రీవారి దర్శనానికి వెళ్లిన భాస్కర్‌ హుండీలో దొంగతనానికి పాల్పడడంతో ఏవీఎస్వో చిరంజీవులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. తిరుమల వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించాడు.
-----
రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే ప్రభాస్.. మరోసారి ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. 
----
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కొవిడ్ ఒమిక్రాన్ ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఐర్లాండ్‌ నుంచి విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ఆయనకు సోకింది సాధారణ వైరస్సా లేక ఒమైక్రానా అనే అనుమానాలు నెలకొన్నాయి. వైద్యాధికారులు ఆయన శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించారు. ఆ రిపోర్టులు వచ్చాకే ఒమిక్రావ్ వచ్చింది లేనిది నిర్దారణ కానుంది.
------
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో దారుణం జరిగింది. గత రాత్రి అక్రమ ఇసుక రవాణాను వీఆర్ఏ గౌతమ్ అడ్డుకున్నారు. దీంతో రెచ్చి పోయిన ఇసుక మాఫియా... వీఆర్‌ఏపై దాడి చేసింది. దీంతో వీఆర్‌ఏ తీవ్రంగా గాయపడటంతో వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వీఆర్‌ఏ మృతి చెందాడు. ఈ ఘటనపై వీఆర్ఏ సంఘాలు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
------
కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న శిల్పా చౌదరిని మరో మారు కస్టడికి ఇవ్వాలని కోరుతూ పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇతర నిందితుల పాత్రపై విచారణ జరపాల్సివుందని, నాలుగు రోజుల కస్టడి కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. కిడ్డీ పార్టీల పేరుతో కాజేసిన డబ్బు ఎక్కడికి తరలించారు అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు

Online Jyotish
Tone Academy
KidsOne Telugu