ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్ కోటి విరాళం.. 

రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే ప్రభాస్.. మరోసారి ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల వచ్చిన వరదలకు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీగా నష్టం జరిగింది. దీంతో వరద బాధితులకు ప్రభుత్వం సాయం చేస్తోంది. సర్కార్ కు అండగా పలువురు విరాళాలు ప్రకటించారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందించారు. తాజాగా హీరో ప్రభాస్ కూడా కోటి రూపాయలు విరాళం అందిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కూడా ప్రభాస్ భారీగానే విరాళాలు అందచేసారు. హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించారు. ఇక కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu