ప్రపంచంలో అత్యంత ఖరీదైన 5 పడవలు

భూమిపై మూడువంతుల నీరు, ఒక వంతు భూమి ఉందన్న విషయం మనందరికీ తెలుసు.
అందుకే మన పూర్వీకులు జల ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు. చిన్నచిన్న పడవల
నుంచి టన్నుల కొద్ది సరుకులను దేశవిదేశాలకు ఎగుమతిదిగుమతి చేయడంలో జల రవాణా సాధనాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. రామాయణంలో వనవాసానికి బయలుదేరిన రాముడు సీత, లక్ష్మణుడు పడవ ప్రయాణం ద్వారానే అయోధ్యను దాటారు. వాస్కోడిగామా పడవ ప్రయాణం చేస్తూనే కొత్తదేశాల ఆనవాళ్లు తెలుసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే పడవల చరిత్ర చాలానే ఉంది. అయితే ప్రస్తుతం రవాణాసాధనాల తీరు మారింది. భూ, జల మార్గాలే కాదు వాయుమార్గం కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పడవలు కేవలం రవాణా సాధనాలుగానే కాదు వారివారి సంపదకు చిహ్నాలుగా మారాయి. ప్రపంచంలోని సంపన్న బిలియనీర్లకు ఖరీదైన కార్లు, విమానాలే కాదు ఆధునిక వసతులతో  పడవలు కూడా ఉన్నాయి. అత్యంత విలాసవంతమైన పడవల్లో హెలిప్యాడ్‌లు, థియేటర్లు, కచేరీ హాళ్లు,  స్విమ్మింగ్ పూల్ లు, ఆవిరి స్నానాలు, హాట్ టబ్‌లు వంటి అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. మరి వాటి వివరాలు ఎంటో తెలుసుకుందామా..


1. హిస్టరీ సుప్రీం (HISTORY SUPREME)
ఖరీదు -  4.8 బిలియన్( 35,54,43,12,000 రూపాయలు)

హిస్టరీ  సుప్రీం పడవ ఖరీదు 4.8 బిలియన్ డాలర్లు. ఇంత ఖరీదు ఎందుకు అనుకుంటున్నారు కదా.. ఈ పడవ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడినది. అంతే ప్రపంచంలోనే  అత్యంత ఖరీదైన పడవగా రికార్డు సృష్టించింది. ఈ నౌక  మలేషియా కు చెందిన సంపన్నుడు  రాబర్ట్ నోక్ సొంతం. ఈ ఓడ తయారీలో పది వేల కిలోల  బంగారం,  ప్లాటినం ఉపయోగించారట.  100 అడుగుల పొడవైన ఈ పడవ నిర్మించడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టిందట. దీనిని UK కు చెందిన  ప్రఖ్యాత లగ్జరీ డిజైనర్ స్టువర్ట్ హ్యూస్ రూపొందించారు. బంగారం , ప్లాటినం లోహాలతో పడవను దాని బేస్ నుండి భోజన ప్రాంతం, డెక్, మెట్లు తదితర భాగాలను  అలంకరించారు. ఈ లగ్జరీ ఓడతో అత్యధికంగా ఆకర్షించేది మాస్టర్ బెడ్ రూమ్.  ఇది మెటోరైట్ రాక్ నుండి తయారు చేయబడిన గోడ. అంతేకాదు టైరన్నోసారస్ రెక్స్ ఎముకలతో తయారు చేసిన విగ్రహం ఇక్కడ కనిపిస్తుంది.

2. ఎక్లిప్స్  (ECLIPSE)
ఖరీదు -  1.5 బిలియన్ డాలర్లు( 11,10,75,97,500 రూపాయలు)

ప్రపంచంలో రెండవ అతిపెద్ద పడవ ఎక్లిప్స్. ఇది రష్యన్ బిలియనీర్ రోమన్ అబ్రమోవిచ్ సొంతం. ఈ పడవతో డిటెక్షన్ సిస్టమ్ ద్వారా క్షిపణి గుర్తింపు వ్యవస్థ ఉంటుంది. అంతేకాదు 2 హెలిప్యాడ్‌లు, 24 గెస్ట్ క్యాబిన్లు, డిస్కో హాల్, రెండు స్విమ్మింగ్ పూల్ లు, హాట్ టబ్‌లు ఉన్నాయి. దీనిని జర్మనీకి చెందిన బ్లోమ్ , వోస్ నిర్మించారు. 533 అడుగుల పొడవైన పడవలో మినీ జలాంతర్గామి కూడా ఉంది, ఇది నీటిలో 50 మీటర్ల వరకు మునిగిపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మాస్టర్ బెడ్ రూమ్ కిటికిలు  బుల్లెట్ ప్రూఫ్.

3. ది అజ్జామ్ ( THE AZZAM)
ఖరీదు -  600 మిలియన్ డాలర్లు ( 44,42,49,90,000రూపాయలు)

590 అడుగుల పొడవైన పడవ 35 కిలోమీటర్ల వేగంతో నీటిపై దూసుకుపోతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన  పడవ ఇది.  యుఎఇ  రాజకుటుంబ సభ్యుడు అజ్జామ్ యాజమాన్యంలో ఉందని వినికిడి. దీని తయారీదారుల ప్రకారం, ఇప్పటివరకు తయారు చేయబడిన అత్యంత క్లిష్టమైన పడవ ఇది.ఫ్రెంచ్ ఇంటీరియర్ డెకరేటర్ క్రిస్టోఫ్ లియోని అధునాతన ఇంటీరియర్‌లను డిజైన్ చేయగా, దాని వెలుపలి భాగాలను నౌటా యాచ్ రూపొందించారు. ఇది మొత్తం 35048 కిలోవాట్ల శక్తితో రెండు గ్యాస్ టర్బైన్లు ,రెండు డీజిల్ ఇంజన్లు ఉంటాయి.

4. మోటర్ యాచ్ ఎ (MOTOR YACHT A )
ఖరీదు - 440 మిలియన్ డాలర్లు (32,58,97,00,000)

మోటారు యాచ్ ఎ  రష్యన్ వ్యాపారవేత్త ఆండ్రీ మెల్నిచెంకోకు చెందినది. ఇందులో 14 మంది అతిథులు ,  42 మంది సిబ్బందిని ఉండవచ్చు. 400 అడుగుల పొడవైన పడవ ఇంటీరియర్స్ 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. 2,500 చదరపు అడుగుల మాస్టర్ బెడ్‌రూమ్ , డిస్కోతో పాటు ఆరు అతిథి సూట్‌లు ఉన్నాయి. వీటిని నాలుగు పెద్ద స్టేటర్‌ రూమ్‌లుగా మార్చడానికి అనువుగా మూవబుల్ వాల్స్ ఉంటాయి. ఇంటీరియర్స్ , ఫర్నిచర్, గ్లాస్ వేర్,  ఫ్రెంచ్ క్రిస్టల్‌తో తయారు చేసిన టేబుల్‌వేర్లను అలంకరించిన అద్దాలు పడవ విలాసవంతమైన  లుక్ ను మరింత పెంచుతాయి. ఇందులో హెలిప్యాడ్,  30 అడుగుల స్పీడ్ బోట్ ఉంటాయి. ఈ పడవలో మూడు స్విమ్మింగ్ పూల్స్  ఉన్నాయి.  వాటిలో ఒకటి గ్లాస్ బాటమ్తో, మరోకటి డిస్కో పై ఉంటుంది. ఈ విలాసవంతమైన పడవను ఆర్కిటెక్ట్ మార్టిన్ ఫ్రాన్సిస్,  ఫిలిప్ స్టార్క్ రూపొందించారు. ఇది చాలా సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ,  సూపర్ లగ్జరీ సదుపాయాలు ఇందులో ఉన్నాయి.

5. దుబాయ్ (DUBAI)
ఖరీదు -  400 మిలియన్ డాలర్లు(29,63,98,00,000)

ఈ పడవ యుఎఇ ఉపాధ్యక్షుడు, ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సొంతం.  531 అడుగుల పొడవు ఉన్న దుబాయ్ పడవను బ్లోమ్,  వోస్ నిర్మించారు.  దాని వెలుపలి భాగాలను ఆండ్రూ వించ్ రూపొందించారు. అత్యంత ఖరీదైన ధరతో పాటు  గొప్ప నాణ్యత,  సృజనాత్మకత కనిపిస్తాయి. అదేవిధంగా ఇందులో మొజాయిక్ స్విమ్మింగ్ పూల్, వృత్తాకార మెట్లు, హెలిప్యాడ్ కలిగి ఉంది. ఈ బ్రహ్మాండమైన సూపర్‌యాచ్‌లో సిబ్బందితో సహా 155 మంది అతిథులు ఉండేలా సదుపాయాలు ఉంటాయి.  దాని ఔట్ లుక్ తో పాటు  లోపలి భాగం చాలా దృఢంగా  ఉంటుంది.  పడవ  ఇంటీరియర్స్  రంగులతో ఆధిపత్యం చెలాయిస్తుండగా, దాని డెక్‌లో స్ప్లిట్-లెవల్ యజమాని డెక్, లాంజ్, అనేక విఐపి ప్రాంతాలు , అతిథుల సూట్‌లు ఉంటాయి. ఈ పడవలో సెలవురోజుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అలా అలా సముద్రయానం చేయవచ్చు.