టమోటా ఫీవర్ తో జర భద్రం!!

 

చిన్న అజాగ్రత టమాటో ఫీవర్ విస్తరణకు అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.టమోటా ఫీవఎర్ విస్తరించేందుకు చిన్న కారణం కావచ్చు. టమోటా ఫ్లూ నుండి రక్షించ బడడానికి తీసుకోవాల్సిన జాగ్రతలు ఏమిటి? అన్న సందేహం ప్రతిఒక్కరిలో ఉంటుంది.కరోనా మహమ్మారి తో పాటు టమోటా ఫీవర్ దేశం లో నేడు కనిపిస్తోంది.5 సంవతసరాల లోపు పిల్లల పై తీవ్రప్రభావం చూపిస్తుంది. టమోటా ఫీవర్ ఎలా విస్తరిస్తుంది.దీనినుండి ఎలా రక్షణ పొందాలి అన్న విషయాలను తెలుసుకుందాం.కేరళ లోని కొల్లం పట్టణం లో టొమాటో ఫీవర్ త్వరిత గతిన విస్తరిస్తోంది.ముఖ్యంగా 5 సంవత్సరాలలోపు తక్కువ వయసు ఉన్న పిల్లల పై తీవ్రప్రభావం చూపిస్తుంది. ఇప్పటి వరకూ టొమాటో ఫీవర్ కు 
సంబందించిన కారణాలు తెలియరాలేదని నిపుణులు అంటున్నారు.ఆరోగ్య శాఖ దీనిపై దృష్టి సారించింది.ఈ ఫీవర్ మరింత విస్తరించకుండా నిలువరించేందుకు ఆయా ప్రాంతాలలో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దీనిగురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
టమోటా ఫీవర్ అంటే ఏమిటి?...
టొమాటో ఫీవర్ ను టమాటో ఫ్లూ పేరుతో పిలుస్తారని అందరికీ తెలుసు.టొమాటో ఫీవర్ ముఖ్యంగా 5 సంవతసరాలలోపు వయసు తక్కువ వయసు ఉన్న పిల్లలో కనిపిస్తుంది.ఇప్పటి వరకూ స్పష్టం కాని అంశం ఏమిటి అంటే ఇది 
వైరల్ ఫీవరా లేక డెంగ్యు చికెన్ గునియా వల్ల వచ్చే సమస్య అన్నది తెలియాల్సి ఉంది.టమాటో ఫ్లూ జ్వరం లో చర్మం పై ఎర్రటి దద్దుర్లు వస్తాయి.దీనిఅకారాం అంటే దద్దుర్ల ఆకారం టొమాటో ను పోలి ఉండం గమనించా మని నిపుణులు పేర్కొన్నారు.అందుకే దీనిని టొమాటో ఫీవర్ కు సంబందించిన కేసులు కొల్లం లో మాత్రమే చూడవచ్చు టమాటో ఫీవర్ కు సంబంధించి ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ మరిన్ని రాష్ట్రాలలో విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు.
టొమాటో ఫీవర్ ఎలా వ్యాపిస్తుంది?...టమాటో ఫీవర్ వ్యాది సోకిన వారు వేరొకరిని తాకడం వల్లవిస్తరిస్తుంది.ఒకవేళ టమాటో ఫీవర్ ఫ్లూ తో పాటు వస్తే అది తగ్గేవరకూ వారిని వేరు వేరుగా ఉంచాలి.టమోటో ఫ్లూ సోకిన పిల్ల వాడిని ఎంతవరకూ వీలైతే అంత దూరం గా ఉంచే ప్రయత్నం  చేయాలి.టమాటో ఫీవర్ ముఖ్యలక్షణాలు...

ఎర్రటి దద్దుర్లు.
చర్మం పై మంట.
అలసట.
మోకాళ్ళలో నొప్పులు 
పొట్టలో నొప్పి,
వాంతులు.
అతి సారం.
ముక్కు కారడం.
తీవ్రమైన జ్వరం.
దగ్గు ,తుమ్ములు.
శరీరం లో నొప్పులు.వంటి లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత పడండి .

టొమాటో ఫీవర్ నుండి రక్షించుకునే ఉపాయాలు...

మీ చుట్టుపక్కల ప్రాంతలాలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి.దురద దద్దుర్లను గోకవద్దు.ఒకరి నొకరు తగల కుండా జాగ్రతలు పాటించాలి.టమాటో ఫీవర్ సోకిన వ్యక్తి వినియోగించే వస్తువులను తిరిగి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి వాడకూడదు.
వ్యాధి సోకిన వ్యక్తికి చలువ చేసే పదార్ధాలు ఎక్కువగా తినిపించాలి దీనువల్ల డీహైడ్రేషన్నుండి కాపాడ వచ్చు.