హై బిపి నిర్లక్ష్యం చేస్తే!!

 

హై పర్ టెన్ క్షణ్ డే సందర్భంగా ప్రత్యేక వ్యాసం. ఆదునికజీవన పరిణామ క్రమం లో నిత్య కృత్యంగా మారిపోయింది వయసుతో నిమిత్తం లేకుండా వచ్చే అనారోగ్య సమస్య బిపి అని అంటున్నారు నిపుణులు. కొన్ని దశాబ్దాల క్రితం కంటే ఈ రోజుల్లో హై బిపి సర్వసాధారణ మై పోయింది.ఈ పారిశ్రామికీకరణ,ఆధునికత హై టెక్ యుగం లో నిత్యజీవితం లో ఎదురయ్యే సమస్యలు అనేక ఒత్తిళ్ళు,వ్యక్తిగత అధిక బరువు,టే న్క్షన్స్,కొలస్ట్రాల్,డయాబెటిస్ మొదలైనవి హై బిపికి కారణ మౌతున్నాయి.దీర్ఘకాలిక. వ్యాదులైన ఆర్త్ఘరైటిస్,గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ వంటి వ్యాధులకు క్రమ శిక్షణ తో కూడిన ఆహారాన్ని తీసుకుంటే దీర్ఘకాలిక హై బిపి వంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండచ్చని నిపుణులు అంటున్నారు. ఒక్కహై బిపి హైపర్ టే న్క్షన్ తోనే ఎన్నోఅనారోగ్య సమస్యలు వస్తున్నాయని అంటున్నారు డాక్టర్ లక్ష్మణ్ రావు గారు.హై బి వచ్చిందో కిడ్నీ కి డ్యామేజ్ ఏర్పడుతుంది.హై బిపి వచ్చిందా గుండె పోటుకు దారితీస్తుంది,హై బిపి వచ్చిందా కంటి నరం దెబ్బ తింటుంది,హై బిపి వచ్చిందా మెదడు లో నరాలు దెబ్బ తింటాయి ఆపైన పక్షవాతం వస్తుంది ఇలా ఒక వ్యక్తిలో బిపి ని నియంత్రించకుంటే వచ్చే అనార్ధాలు ఇన్ని అన్ని కావని మొదటగా రోగి వెళ్ళిన వెంటనే డాక్టర్లు మొదటగా చూసేది బిపి మాత్రమే అంటే మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే హై బిపి ఎంత ప్రమాద కరమో అర్ధం చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు ఈమేరకు ప్రముఖ వైద్యులు మాట్లాడుతూ బిపి అందరికీ ఉంటుందని అయితే బిపి ఉందన్న సంగతి గుర్తించక పోవడ ఒక సమస్య అయితే బిపి ఉన్న వాళ్ళు తగిన జాగ్రతలు తీసుకోక పోవడం ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు.బిపి ని నియంత్రించక పోవడం సరైన శ్రద్ధ తీసుకోకుంటే అది ప్రాణాంతకం అవుతుందని .అదీ కాక బిపి ని నియంత్రించడానికి అనేక అద్భుత మైన మందులు మార్కెట్లో లభిస్తాయి.కొంతమంది బిపి వచ్చిందని తెలిసినా డాక్టర్ ను కలవకుండా దానికి అదే తగ్గు తుందిలే అని నిర్లక్ష్యం చేస్తున్నారు. 

బిపి ని వైద్య పరి భాషలో...

బిపి అంటే బ్లడ్ ప్రేషర్ అని మాత్రమే అనుకుంటారు శాస్త్రీయంగా సిస్టాలిక్ -డయాస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ అని అంటారు.మన హృదయం అనుక్షణమూ రక్తనాళాల లోకి రక్తాన్ని పంప్ చెస్తూ ఉంటుంది.దేహానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది.ఇలా రక్తాన్ని పంప్ చేయడానికి గుండె కుంచించుకు పోతుంది.అలా గుండె కుంచించుకు పోయినప్పుడే రక్తం గుండె నుండి రక్త నాళాల లోకి వేగంగా ప్రవహిస్తుంది.ఈ ఒత్తిడిని సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ అని అంటారు.

* గుండె తిరిగి సాధారణ స్థితికి వ్యాకోచించు కున్నప్పుడు ఏర్పడే రక్త స్థితిని డయా స్టాలిక్ బ్లడ్ ప్రెజర్ అంటారని నిపుణులు అంటున్నారు.

*బిపిని పాదరసపు మిల్లీ మీటర్లలో కొలుస్తారు.

ఉదాహరణకు బిపి లో సిస్టాలిక్ ప్రెజర్ -12౦.

*డయాస్టాలిక్ ప్రెజర్ -8౦ 

రక్తపు సాధారణ స్థితి ఎలాఉంటుంది...

*ఏ వయస్సులో అయినా రక్తపు సిస్టాలిక్ ప్రెజర్ 1౦౦ -14౦ మధ్య ఉండడం సాధారణ స్థితి.

*కొందరు 9౦ వుండడం సాధారణ స్థితిగా అనుకుంటారు.అయితే ఒక్కోమనిషిలో ఒక్కోరకమైన రక్తపు సాధారణ స్థితిని గమనించవచ్చు.కొందరిలో వయసు పెరుగుతున్నకొద్దీ సిస్టాలిక్ ప్రెజర్ పెరుగుతూ ఉండడం గమనించ వచ్చు.

*డయాస్టాలిక్ ప్రెజర్ మాత్రం ఏ వయస్సులో అయినా రావచ్చు.6౦ -9౦ మధ్య ఉండడం సాదర స్థితిగా వైద్యులు పేర్కొన్నారు.

*సహజంగా పరిశీలిస్తే వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుంచి సాయంత్రానికి మారిపోతుంది.ఉదయపు వేళల్లో తక్కువ వత్తిడి ఉంటుంది.పగటి పూట పనుల్లో అలిసి పోయి ఉండడం తో సాయంత్రానికి ఎక్కువ వత్తిడి ఉంటుంది.ఒక వ్యక్తిలోని కోపతాపాలు,ఆవేశ కావేశాలు,ఆయా పరిస్థితులలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా ఉద్రేకం,ఆందోళన,భయం,వంటివి మనిషిలో బిపి ని పెంచుతాయి.ఎమోషన్స్ సాధారణ స్థాయికి రాగానే బిపి కూడా మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది.

*ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో బిపి ఎక్కువగా చూపినంత మాత్రాన అది బిపి కిందకు రాదు.నాలుగు ఇదు సార్లు వేరు వేరు రోజుల్లో బిపి ని చెక్ చేసుకోవాలి అన్ని సార్లు ఎక్కువే వస్తుంటే మాత్రం దానిని హై బిపి కింద తీసుకో వచ్చ్గు.

హై పేర టెన్క్షణ్...

హై బిపి మరీ అసాధారణం గా పెరిగి పోతే దానిని హై పర్ టెన్క్షణ్ అని అంటారు.మానసికంగా శారీరకంగా ఒత్తిడి గురియినప్పుడు బిపి హై పర్ టెన్క్షణ్ కి దారి తీస్తుంది.అయితే హైపర్ టెన్ క్షణ్ తో బాధ పడే వ్యక్తికి ఏ వత్తిడి లూ లేని సాధారణ స్థితిలో కూడా బిపి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా మంది తమకు హై పర్ టెన్క్షణ్ ఉందని తెలియకుండానే దానితో బాధపడుతూ సడన్ గా గుండె పోటు కో,పక్ష వాతానికో గురికావడాన్ని గమనించవచ్చు అయితే ఒక వయసుదటాక రెగ్యులర్ గా మెడికల్ చకప్ చేయించుకోవడం అవసరం.హై పర్ టెన్క్షణ్ స్త్రీల కంటే పురుషులలో అధికంగా ఉంటుంది అలాగే మధ్య వయస్సు లో ఉన్నవారికి,వయస్సు మళ్ళిన వాళ్ళలో అత్యధికంగా ఉంటుంది.చెప్పుకోదగ్గ రీతిలో యుక్త వయస్కులలో కూడా తరచుగా కనిపిస్తోంది.

హై బిపి ని నియంత్రిన్చాకుంటే ప్రమాదమే ....

హై బిపి నిర్ధారణ అయ్యిన తరువాత ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా వచ్చే అనార్ధాలు ఇవే...

ఆయుషు తగ్గుతుంది ...

హై బి పి ని సక్రమంగా నియంత్రించుకొకుంటే ఆవ్యక్తి ఆయుష్షు తగ్గిపోత్తుంది.సాక్ష్యాధారాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.బిపి ని నియంత్రించుకోకుంటే అర్ధంతరంగా 16 సంవత్సరాల ముందుగానే చనిపోతారు.

45 -55 సంవత్సరాల వయస్సుకల వారిలో 6 --11సంవత్సరాల లోపు చనిపోయిన దాకలాలు ఉన్నాయి.

గుండె పెరుగుతుంది...

హై బి పి ఉన్న వ్యక్తి రక్త నాళాల లో కి రక్తం అధిక పీడనం తో ప్రవహించడం వల్ల గుండె మీద అధిక బారం పడి రక్తాన్ని పంప్ చేయడం గుండె ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది.ఆక్రమం లో ఆ వ్వ్యక్తిగుండె బాగా పెరిగి ఇక ఏ మాత్రం ఒత్తిడిని తట్టుకోలేక రక్త ప్రసారం సామార్ధ్యం కోల్పోతుంది.

కోరోనరీ ధమని వ్యాధి...

హై బిపి మూలంగా చివరికి కోరోనరీ ధమనులు ఇరుకుగా అయి పోయి అది యంజైనా కి గుండె పోటు కీ దారి తీస్తుంది.

బ్రెయిన్ హేమరేజ్...

రక్త పోటు తీవ్రత వల్ల మెదడులోని రక్త నాళం చిట్లి రక్త స్రావం జరిగి ఆ వ్యక్తి మృత్యువును చేరుకోవచ్చు.లేదా మెదడు డ్యామేజ్ అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

పక్షవాతం...

రక్త పీడనం మాటి మాటికి పెరగడం వల్ల కొన్నాళ్ళకు మెదడుకు రక్తాన్ని చేర వేసే నాళాలు ఇరుకుగా అయి మూసుకు పోయి త్రంబోసిస్ పెరాలసిస్ వంటి అనారోగ్యం దీర్ఘకాలిక అనారోగ్యం శాశ్వత అంగవైకల్యం రావచ్చు.

కంటికి అనార్ధాలు...

హై బిపి మూలంగా కంటి వెనుక ఉండే నరం ఉబ్బడం లేక చిట్లడం జరిగి ఎదుటి దృశ్యాలు అల్లుకు పోయినట్లుగా కనిపించి కాల క్రమం లో కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది కంటి రక్త సరఫరా చేసే నరం పూర్తిగా మూసుకు పోయి అకస్మాతుగా అంధత్వానికి దారి తీయ వచ్చు.

హై బిపి తలనొప్పి ...

హై బి పి మరీ తీవ్రమై నప్పుడు మెదడులోని ధమనులు బిగుసుకు పోయి లేదా మెదడు వాపు చెంది దానిఫలితంగా తీవ్రమైన తల నొప్పి తాత్కాలికంగా చూపు తగ్గిపోవడం మాటలు తడబడడం ఒక్కోసారి ఫైట్స్ కూడా రావచ్చు.

కిడ్నీ ఫైల్యూర్....

హై బిపి ని నిర్లక్ష్యం చేసి చికిత్చ తీసుకోకుంటే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉందని.పగాలే కాక రాత్రి కూడా మూత్రానికి వెళ్ళడం అతని కిడ్నీలు పది శరీరం నుండి తోక్సికేంట్స్ నిల్వ పెరగడం మొదలుఅవుతుంది.