ఆసుపత్రుల పాలవుతున్న టాలీవుడ్...
posted on Nov 18, 2016 3:43PM

నల్లధనం ఏం చేయాలో తెలియక మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కోటీశ్వరులు హాస్పిటల్స్ పాలు అవుతున్నారు. అంటే... ఏ హార్ట్ ఎటాకో , బీపీనో వచ్చి ట్రీట్ మెంట్ లు తీసుకోవటం లేదు. మరింతకీ మ్యాటర్ ఏంటంటే...
టాలీవుడ్ లో దోచిన, దాచిన నల్ల డబ్బంతా డిసెంబర్ 30 తరువాత పాచిపోయి కంపు గొట్టే పరిస్థితి వచ్చేసింది. అందుకే, రోజుకు కోట్ల కొద్దీ లావాదేవీలు జరిపే కార్పోరేట్ హాస్పిటల్స్ ని మన వాళ్లు ఎంచుకుంటున్నారు. సాధారణంగా ప్రైవేట్ హాస్పిటల్స్ రాత్రికల్లా పది, పదిహేను కోట్లు ఈజీగా బ్యాంకుల్లో వేస్తుంటాయి. ఇలా ఇన్ని కోట్ల కలెక్షన్స్ ప్రతీ రోజూ మరే రంగంలోనూ వుండవు.
కార్పోరేట్ హాస్పిటల్స్ మ్యానేజ్ మెంట్ తో తమకు వున్న పరిచయాలు, బాంధవ్యాలు వంటివన్నీ ఉపయోగించి ఇప్పుడు టాలీవుడ్ బ్లాక్ మనీని వైట్ చేస్తోంది. హాస్పిటల్స్ నల్లరాయుళ్లతో జత కట్టి పేషెంట్స్ బిల్లుల్లో ఈ బ్లాక్ మనీని కూడా తోసేస్తున్నాయి. కొన్ని చోట్ల అయితే పేషెంట్లతో కుమ్ముక్కై దొంగ బిల్లులే సృష్టిస్తున్నారట! అలా లక్షల రూపాయాల బిల్లులు ప్రింటవుట్లు తీసి నల్ల డబ్బును బ్యాంకులకు తరలిస్తున్నారు. మ్యానేజ్ మెంట్లకు కమీషన్ వస్తుంటే నల్ల మారాజులకు పోగా మిగిలింది చేతికొస్తోంది!