చెమట వాసనతో ఇబ్బంది పడుతున్నారా? నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే మ్యాజిక్కే..!
posted on Apr 24, 2025 12:01PM

మండుతున్న ఎండల కారణంగా ప్రజల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ సీజన్‌లో ప్రతి రెండవ వ్యక్తి చెమటతో ఇబ్బంది పడుతుండటం గమనించవచ్చు. దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. చెమట వల్ల శరీరం దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. ఈ దుర్వాసన కారణంగా నలుగురిలో కలవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు స్నానపు నీటిలో కొన్ని వస్తువులను జోడించడం ద్వారా చెమట వాసనను వదిలించుకోవచ్చు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
వేప ఆకులు..
చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటే, స్నానపు నీటిలో వేప ఆకులు వేసి మరిగించాలి. దీని కోసం ఒక గిన్నెలో నీరు తీసుకుని, అందులో వేప ఆకులు వేయాలి. ఇప్పుడు ఈ నీటిని మరిగించాలి. నీరు చల్లబడిన తర్వాత దానిని వడకట్టి స్నానపు నీటిలో కలపాలి. ఇప్పుడు ఈ నీరు స్నానానికి ఉపయోగించాలి.
రోజ్ వాటర్..
రోజ్ వాటర్ ఉంటే చెమట వాసనను తొలగించడానికి దాన్ని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి స్నానపు నీటిలో రెండు నుండి మూడు చెంచాల రోజ్ వాటర్ కలపాలి. ఇప్పుడు ఈ నీరు స్నానానికి ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ ని నీటిలో కలిపి ప్రతిరోజూ ఆ నీటితో స్నానం చేయాలి. దీన్ని ఉపయోగించడం ద్వారా చెమట వాసన నుండి ఉపశమనం పొందవచ్చు.
బేకింగ్ సోడా..
బేకింగ్ సోడా ప్రతి భారతీయ వంటగదిలో కనిపిస్తుంది. చెమట దుర్వాసనను వదిలించుకోవడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. రెండు చెంచాల బేకింగ్ సోడాను స్నానపు నీటిలో కలిపి, ఆ నీటితో స్నానం చేయాలి. ఈ నీటితో స్నానం చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బేకింగ్ సోడా అందరికీ సరిపోదు. దీని కారణంగా అలెర్జీలను ఎదుర్కోవలసి రావచ్చు.
అలోవెరా జెల్..
ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే స్నానం చేసే నీటిలో అలోవెరా జెల్ కలపాలి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. ఈ నీరు చర్మాన్ని చల్లబరుస్తుంది, శరీరం తాజాగా అనిపిస్తుంది.
*రూపశ్రీ.