ప్రతి భర్త రోజూ ఈ 5 పనులు చేస్తే బార్య ఎప్పటికీ నిరాశ పడదు..!



వివాహం అనేది భారతీయ సమాజంలో జీవితాంతం నిలిచే బంధంగా పరిగణించబడే సంబంధం. అయితే  ఈ జీవిత బంధాన్ని సంతోషంగా గడపాలనుకుంటే ఆ సంబంధంలో ప్రేమ, గౌరవం అవసరం. చాలా మంది భార్యాభర్తలు ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు కానీ  వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు, వాటిలో ఒకటి నిరాశ.

ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి తన భర్త ఇంటికి వచ్చినప్పుడు, ఆమె అతన్ని అంగీకరించడమే కాకుండా తన భర్త పద్ధతులను, ఇష్టాయిష్టాలను కూడా స్వీకరిస్తుంది. కానీ ఒక పురుషుడు తన భార్య తనకు ఎంత ప్రత్యేకమైనదో ఆమెకు తెలియజేయడంలో విఫలమవుతాడు. ఈ కారణంగా  స్త్రీలు తమ భర్తల పట్ల,  ఆ సంబంధం పట్ల నిరాశ చెందుతారు.  భర్త భార్యను నిరాశపరచకూడదనుకుంటే, ఆమె భర్తను ఎల్లప్పుడూ ప్రేమించాలని,   సంబంధం సంతోషంగా ఉండాలని కోరుకుంటే ప్రతి భర్త ఈ ఐదు పనులు ప్రతిరోజూ చేయాలి.

ప్రేమను వ్యక్తపరచడం..

 అవకాశం దొరికినప్పుడల్లా భార్యతో "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పాలి.  ప్రేమను వ్యక్తపరచడం వల్ల  భార్య పట్ల  శ్రద్ధ వహిస్తున్నారని ఆమెకు భరోసా లభిస్తుంది. రోజూ  ప్రేమను వ్యక్తపరచడంతో పాటు వారితో రోజుకు రెండు మూడు సార్లు ప్రేమగా మాట్లాడితే మహిళలు కూడా దీన్ని చాలా ఇష్టపడతారు. ప్రేమ ఉంది కానీ దానిని వ్యక్తపరచకపోతే లేదా చూపించకపోతే భార్యకు ఎలా తెలుస్తుంది?

కలిసి తినడం..

దంపతులు ఎంత బిజీగా ఉన్నా కనీసం  భోజనం కలిసి తినాలి. భర్త రోజుకు ఒకసారి అయినా భార్యతో కూర్చుని భోజనం చేయాలి. అల్పాహారం అయినా, భోజనం అయినా, రాత్రి భోజనం అయినా ఇద్దరూ కలిసి కూర్చుని భోజనం చేసినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే కుటుంబం ఉన్నప్పటికీ భర్త లేకుండా భార్య భోజనం చేసినప్పుడు ఆమె ఒంటరిగా ఫీలవుతుంది. కాబట్టి భర్త  తన భార్యతో కలిసి భోజనం  చేయడానికి సమయం కేటాయించాలి.

బయటకు వెళ్ళే ముందు..

ఆఫీసుకు వెళ్లే ముందు భార్యతో సమయం గడపాలని కోరుకుంటున్నారని, కానీ మీరు పనికి వెళ్లాలని ఆమెకు అనిపించేలా చేయండి. దీనికోసం మీరు ప్రేమపూర్వకమైన ఒక నోట్ రాయవచ్చు లేదా ఇంటి నుండి బయలుదేరే ముందు వారిని కౌగిలించుకుని  జాగ్రత్త చెప్పవచ్చు.  ఈ చిన్న  విషయాలు వారికి  ప్రేమను అర్థం అయ్యేలా చేస్తుంది.

కౌగిలి..

ఉదయం నిద్ర లేవగానే  భార్యను కౌగిలించుకోవడం ప్రతి భార్య చాలా సేఫ్ ఫీలింగ్ అనుభూతి చెందుతుంది. ప్రతి భార్య తన భర్త చేతుల్లో సురక్షితంగా,  సుఖంగా ఉంటుంది. ప్రేమను వ్యక్తపరచడానికి,  భార్య హృదయాన్ని గెలుచుకోవడానికి కౌగిలించుకోవడం మంచి మార్గం.  ఆఫీసుకు వెళ్ళేటప్పుడు లేదా తిరిగి వచ్చినప్పుడు భార్యను కౌగిలించుకోవడం ఇద్దరికీ చాలా ఊరట ఇస్తుంది.

ఫిర్యాదు వద్దు, మద్దతు ఇవ్వాలి..

మహిళలు తమ భర్తలను, అత్తమామలను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఆమె తన భర్త మద్దతు మాత్రమే కోరుకుంటుంది. అయితే, భర్త తమ భార్య లోపాల గురించి ఫిర్యాదు చేసినప్పుడు భార్య నిరుత్సాహపడుతుంది. మీరు వారితో ఉన్నారనే భావన వారికి కలిగించాలి. ఫిర్యాదు చేయడానికి బదులుగా, చిన్న పనులలో వారికి మద్దతు ఇవ్వాలి. మంచం సర్దడం లేదా  టీ తయారు చేయడం వంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా  వారి హృదయాలను గెలుచుకోవచ్చు.  

                              *రూపశ్రీ