కర్ణాటకలో ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి టిప్పు సుల్తాన్ వివాదం

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆ రాష్ట్రంలో ఓ వంక  రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మరో వంక, మత ఉద్రిక్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ముమ్మర మయ్యాయి. నిజానికి, ఒక్క మతం  కార్డును మాత్రమే కాదు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజీపీ ఇటు మతం కార్డును, అటు కులం కార్డును ఒకే సారి, ప్రయోగించేందుకు ఒక పథకం ప్రకారం పావులు కదుపుతోంది.

ఈ విషయంలో  బొమ్మై ప్రభుత్వం ఏ మాత్రం వెనకాడడం లేదన్నది విపక్షాల ఆరోపణ. నాలుగేళ్ళ బీజేపీ పాలనలో అవినీతిని పెంచి పోషించి,  40 పెర్సెంట్ సర్కార్ గా  అప్రతిష్ట పాలైన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం కులం పేరిత, మతం పేరిట ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి అక్రమ పద్దతిలో ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేస్తోందని  ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 

నిజానికి కర్ణాటకలో టిప్పు సుల్తాన్‌ వివాదం ఇప్పటిది కాదు.  2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా ఈ వివాదం రగులుతూనే వుంది. కాంగ్రెస్ పార్టీ టిప్పు సుల్తాన్ ను దేశ భక్తుడు అంటుంటే.. బీజేపీ టిప్పును దేశ ద్రోహిగా వర్ణించడమే కాకుండా టిప్పు అనుచరులకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదని అంటోంది.  అప్పట్లోనే, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్  ఈ వివాదానికి తెర తీశారు.  అప్పటి నుంచి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ మొదలు బీజేపీ నేతలు తరచూ ఈ వివాదాన్ని తెర మీదకు తెస్తూనే ఉన్నారు. కర్నాటక రాష్ట్రంలో హనుమాన్ భక్తులుండాలా లేదా టిప్పు వారసులుండాలా ?అనే ప్రశ్నను తెర మీదకు తెస్తూనే ఉన్నారు. తెర మీదకు తేవడం మాత్రమే కాదు..  కర్ణాటక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, టిప్పు సుల్తాన్ ను దేశ ద్రోహిగా చిత్రించే డాక్యుమెంటరీ చిత్రీకరణకు సిద్దమైంది. ఇప్పడు అదే క్రమంలో కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీ జాతీయ కార్యదర్శి  సి.టి.రవి మళ్ళీ మరోమారు అదే వివాదాన్ని తెర మీదకు తెచ్చారు.

ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ.. తాను టిప్పు సుల్తాన్‌ సమయంలో పుట్టి ఉంటే ఊరి గౌడ, నంజే గౌడలా తిరుగుబాటు చేసేవాడినని పేర్కొన్నారు. పాత మైసూర్‌ ప్రాంతంలోని  కొన్ని వర్గాలు, ఈ ప్రకటనకు మద్దతుగా నిలిచాయి. టిప్పు సుల్తాన్‌తో వక్కలిగ పాలకులు ఊరి గౌడ, నంజే గౌడ యుద్ధం చేసి టిప్పును హతమార్చినట్లు వీరు నమ్ముతారు. ఇదే ఇప్పుడు వివాదానికి బీజం వేసింది. చిక్‌మగళూరులో జరిగిన  సభలో సి.టి.రవి మాట్లాడుతూ  టిప్పు పాలించే సమయంలో పుట్టి ఉంటే, నేనూ ఊరిగౌడ, నంజే గౌడలానే ఉండేవాడిని. తిరుగుబాటు చేసేవాడిని. ఓ మతపరమైన వ్యక్తిపై ఖడ్గం ఎత్తిన వాడిగా గుర్తింపు పొందేవాడిని  అని వ్యాఖ్యానించారు.

కర్ణాటకలోని బలమైన వక్కలిగ సామాజిక వర్గానికి చెందిన  నేతల్లో రవి కూడా ఒకరు. నిజానికి   టిప్పు మరణంపై గతంలో చర్చ జరిగింది. అయితే.. గతేడాది ‘టిప్పువిన నిజ కనసుగలు’ పేరిట ఓ నాటకం విడుదలైన సమయంలో ఊరి గౌడ, నంజే గౌడ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి రంగాయణ డైరెక్టర్‌ అడ్డనాడ కరియప్పా దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు చేస్తున్నాయంటూ కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)లను విమర్శించడానికి బీజేపీ దీనిని వాడుకొంటోంది. మరోవైపు బీజేపీ ప్రకటనను ప్రతిపక్ష కాంగ్రెస్‌, జేడీఎస్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉరి గౌడ, నంజే గౌడ అనే పాలకులు లేరని.. కేవలం కల్పిత పాత్రలు మాత్రమే అని చెబుతున్నాయి.అయితే, కర్ణాటక రాజకీయాల్లో కులం, మతం ప్రభావాన్ని తక్కువగా చూడ లేమని అంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu