టైమ్స్ నౌ .. పెయిడ్ సర్వే
posted on Apr 24, 2023 11:19AM
దేశంలో ఇప్పటికిప్డుప్పుడు లోకసభ ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర వెూడీ నేతృత్వంలోని ఎన్డీయే గెలుపు తథ్యమని, వెూడీనే మళ్లీ ప్రధాని అవుతారని, ఎన్నికల ముందు ప్రతిపక్ష కూటమి ఏర్పాటైనా వెూడీని ఢీకొట్టలేవని టైమ్స్ నౌ నవభారత్ సర్వే తేల్చింది. వెూదీ ప్రభుత్వం పనితీరుపై 51 శాతం సంతృప్తిగా ఉన్నారని, 2014, 2019కు మించి 2024లో బీజేపీ 338 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. అయితే, దీనిని కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు కొట్టి పారేస్తున్నాయి.
ఎన్నికల్లో ఈసారి వెూడీకి అంత సీన్ లేదని కాంగ్రెస్ పేర్కొంది. గత రెండు లోకసేభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత లేనప్పుడు బీజేపీ సాధించిన సీట్ల కంటే.. 2024లో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ బీజేపీకి అదనంగా సీట్లు ఎలా వస్తాయనే ప్రశ్నలు పరిశీలకులలోనే కాదు.. సామాన్యులలోనూ ఉత్పన్నమౌతున్నాయి. అందులోనూ త్వరలో పలు రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల ఫలితాలు లోకసభ ఎన్నికలపై పడే అవకాశాలు కచ్చితంగా ఉంటాయి.
అదే సమయంలో, దక్షిణాదిలో బీజేపీ బలహీనంగా ఉండటం, ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్న తీరు, యూపీలో ఎన్‌కౌంటర్లు వంటివి ఆ పార్టీ ఓటు బ్యాంకుకు గండికొట్టడం ఖాయమన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమౌతోంది.
ఇప్పటికిప్పుడు లోకసేభకు ఎన్నికలు వస్తే 292 నుంచి 338 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని టైమ్స్ నౌ సర్వే పేర్కొంది. అలాగే కాంగ్రెస్‌కు 106 నుంచి 144, టీఎంసీకి పశ్చిమబెంగాల్‌లో 20 నుంచి 22, ఒడిశాలో బీజేడీకి 11 నుంచి 13 స్థానాలు దక్కుతాయని, ఇతరులకు 50 నుంచి 80 సీట్లు వస్తాయని తెలిపింది. వెూడీ 2014లో అధికారంలోకి వచ్చినపðడు బీజేపీకి 282 స్థానాలు దక్కాయి. 2019లో 303 సీట్లలో కమలనాథులు గెలిచారు. 2024లో సొంతంగా బీజేపీకి 338 సీట్లు వరకూ వస్తాయని సర్వే చెబుతోంది. బీజేపీకి ఓట్ల పరంగా 38.2 శాతం, కాంగ్రెస్‌కు 28.7 శాతం, ఇతరులకు 33.1 శాతం ఓట్ల వస్తాయని అంచనా వేసింది.
ప్రధానిగా వెూడీకి అనుకూలంగా 64 శాతం మంది ఓటు వేయగా, రాహుల్‌కు 13 శాతం ఓట్లు వచ్చాయి, తర్వాత స్థానంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజీవ్రాల్, నితీష్, కేసీఆర్ నిలుస్తారని తెలిపింది. 2024 లోపు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తాయని 31 శాతం , రారని 26 శాతం మంది, ఎన్నికల తర్వాత పొత్తు ఉంటుందని మరో 26 శాతం తేల్చారు. వెూడీ మొదటి ఐదేళ్ల పాలనలో కంటే వెూదీ ప్రభుత్వ 2.0 పని తీరు పట్ల 51 శాతం ప్రజలు అంసంతృప్తిగా ఉన్నారని సర్వే చెబుతోంది. అంటే...కాస్త అటూఇటూగా అసంతృప్తి కూడా పెరిగినట్టే. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి ప్రధాన సమస్యలు ఉండనే ఉన్నాయి. అవినీతిపై పోరాటం ఆగదంటూ పాలకులు ఎంత ఘనంగా ప్రజారం చేసుకుంటున్నా.. ఆ సాకుతో ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డగోలుగా ఉపయోగిస్తోందన్న ఆరోపణను కూడా కేంద్రం అంతే బలంగా ఎదుర్కొంటోంది. బీజేపీయేతర రాష్టాల్లో గవర్నర్లు అక్కడి ప్రభుత్వాలను పనిచేయనీయడం లేదని, ఒక రకంగా కక్ష సాధింపు ధోరణిని అవలంబిస్తూ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.
పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్టాల్లో పాలక ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య సయోధ్య కుదరని సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించిన సందర్భాలు కూడా లేకపోలేదు. మూడు నెలలకు ఒక ప్రభుత్వాన్ని కూల్చడం కేంద్ర సర్కార్‌కు పరిపాటైందని, నయానో భయానో తమ నేతలను బీజేపీ వైపు తిపðకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చదోయడం ఒక రివాజుగా మారిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వారి విమర్శలకు బలం చేకూర్చేలా గోవా, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో బీజేపీ అధికారం హస్తగతం చేసుకున్న తీరు ఉంది. ప్రతిపక్షాలు లేని ఏకపార్టీ పాలనతో నియంతృత్వం వైపు బీజేపీ అడుగులు సారిస్తోందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌లో చోటుచేసుకుంటున్న ఎన్‌కౌంటర్లు, బుల్డోజర్ల కూల్చివేతలు వంటివి మాఫియాపై ఉక్కుపిడికిలిగా చెబుతున్నప్పటికీ, నిరసనలు, అసంతృప్తులు కూడా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. వందే భారత్ ఎక్సప్రెస్‌లు విస్తరిస్తున్నప్పటికీ కరోనా పేరుతో ఆగిపోయిన ప్యాసింజర్ రైళ్లు మళ్లీ ఎప్పుడు పట్టాల విూదకు వస్తాయని సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇదే కరోనా పేరుతో సీనియర్ సిటిజన్లకు రాయితీలు తొలగించారు. వాటిని పునరుద్ధద్ధరించకపోవడం కూడా జనంలో మోడీ సర్కార్ పై ఆగ్రహం పెరగడానికి కారణమౌతోంది. ఇక టైమ్స్ నౌ నవభారత్ సర్వేలో ఆంధప్రదేశ్‌లో మళ్లీ జగన్‌దే హవా తేలడం కూడా ఈ సర్వే విశ్వసనీయతను ప్రశ్నార్ధకంగా చేసింది.
ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే పేర్కొనడంపై జనంలోనూ, రాజకీయ వర్గాలలోనూ కూడా ఈ సర్వే.. ఎవరి ప్రయోజనాల కోసం చేశారో అర్ధమైపోతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్రశ్నిస్తే దాడులు... అధికార వైసీపీ నేతల అక్రమాలు, అప్పులు పుడితే తప్ప ఉద్యోగులకు జీతాలివ్వలేకపోవడం... కోడికత్తి కేసు, వైఎస్ వివేకాహత్యకేసుల్లో సీఎం జగన్ విశ్వసనీయత ప్రశ్నార్థకం కావడం, ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు సహా అన్ని వర్గాల నుంచీ వ్యతిరేకత ఎదురవుతుండటం, గడపగడపకు, నువ్వే మా నమ్మకం జగన్ అంటూ జనంలోకి వెళుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిథులను ఎక్కడికక్కడ జనం ప్రశ్నలతో నిలదీయడం వంటి సంఘటనలు జరుగుతున్న ఏపీలో తరుణంలో జగన్ హవా అంటూ టౌమ్స్ నౌ నవభారత్ చేసిన సర్వేకి జగన్ దే హవా అంటూ సర్వేపేర్కొనడంతో ఆ సర్వే ఫేక్ అన్న అభిప్రాయం మెజారిటీ ప్రజలలో వ్యక్తంఅవుతోంది. ఆంధప్రదేశ్ ప్రభుత్వం కొద్దికాలం క్రితం బెన్నెట్ కోల్‌మన్ అండ్ కంపెనీ (టైమ్స్ గ్రూప్)తో రూ.8.15 కోట్లతో ఒక డీల్ కుదుర్చుకుంది. రాష్ట్రం, పార్టీ నేతల ఇమేజ్‌ను జాతీయ స్థాయిలో పెంచేందుకు, ఆంధప్రదేశ్ ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఉద్దేశించిన డీల్ ఇది. ఆ ఒప్పందానికి అనుగుణంగానే తాజా సర్వేలో వైఎస్‌ఆర్‌సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు సర్వేలో కట్టపెట్టినట్టు రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
కేంద్రం వద్ద తన ఇమేజ్ ను పెంచుకోవడానికి వైసీపీ ఈ సర్వేను ఉపయోగించుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయ స్థానం చేసిన వ్యాఖ్యలు జగన్ సర్కార్ పరువును నిలువుగా గంగలో ముంచేశాయి. అలాగే ఇటీవలి కాలంలో బీజేపీ ఏపీలో జగన్ పాలనపై విమర్శల దాడి పెంచింది. ఈ నేపథ్యంలోనే టైమ్స్ నౌ సర్వే వెలువడటంతో ఈ సర్వే విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారింది. బెన్నెట్ కోల్‌మన్ అండ్ కంపెనీ (టైమ్స్ గ్రూప్)తో ఏపీ సర్కార్ ఒప్పందానికీ, ఈ సర్వేకీ సంబంధం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి