తగ్గిన తుమ్మల మెజార్టీ..

 


పాలేరు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ నుండి బరిలో దిగిన తుమ్మల నాగేశ్వరరావు ముందు నుండి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అయితే మొదటి మూడు రౌండ్లలో 13,810 ఓట్ల ఆధిక్యంతో ఉన్న తుమ్మల.. ఇప్పుడు తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి మెజార్టీ తగ్గినట్టు తెలుస్తోంది. 9వ రౌండ్‌ ముగిసే సరికి తుమ్మల 27, 989 ఆధిక్యంలో ఉన్నారు. 14 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది.

 

కాగా  కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో ఈ ఉపఎన్నిక ఖరారైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు ఉపఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ ఇప్పుడు ఈ ఉపఎన్నికలో కూడా విజయం సాధిస్తే నాలుగోసారి కూడా విజయం సాధించినట్టే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu