ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టుల హతం

ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం (జూన్ 18) ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో జరగిన భారీ ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా నక్సల్స్ సహా ముగ్గురు మరణించారు.  

 దేవిపట్నం   పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకావాడగండి గ్రామ సమీపంలో గల కిట్టూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో  ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ఒక ఏసీఎం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్ ఉదయ్,  అరుణ, ఏసీఎం సభ్యురాలు అంజుగా గుర్తించారు. సంఘటనా స్థలం నుంచిమూడు ఏకే 47లు స్వాధీనం చేసుకున్నారు.  మరి కొందరు నక్సలైట్లు తప్పించుకున్నారని భావిస్తున్నారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu