భార్యాభర్తల మధ్య విడాకులకు దారి తీసే విషయాలు ఇవే.. వీటిని దూరంగా ఉంచాలి..!

 



వివాహం అంటే అన్ని పరిస్థితులలోనూ ఒకరికొకరు అండగా నిలబడటం. కష్టం, నష్టం,  బాధ,  సంతోషం.. ఇట్లా అన్ని విషయాలలోనూ ఒకరికి ఒకరుగా ఉండాలి. కానీ కొన్నిసార్లు చిన్న అపార్థాలు,  విభేదాలు భార్యాభర్తల మధ్య  విడాకుల వరకు వెళతాయి. అందువల్ల భార్యాభర్తల బంధం ఆరోగ్యంగా సాగడానికి.. విడాకుల వరకు వెళ్లకుండా ఉండటానికి  భార్యాభర్తల మధ్య కొన్ని విషయాలు ఎప్పటికీ చోటు చేసుకోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. వీటిని సకాలంలో పరిష్కరించకపోతే, అవి  వైవాహిక బంధాన్ని ప్రమాదంలో పడేస్తాయి.

అహంకారం,  మొండితనం..

భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకం,  అవగాహనపై ఆధారపడి ఉంటుంది. కానీ అహం అడ్డువచ్చినప్పుడు ప్రతి చిన్న విషయం సంఘర్షణకు మూలంగా మారుతుంది. వివాహంలో అహం సమస్యలు సంబంధాన్ని బలహీనపరుస్తాయి . కాబట్టి రాజీ పడటం నేర్చుకోవాలి.  సర్థుకుపోయే తత్వం కేవలం ఒకరిలోనే కాదు.. ఇద్దరిలో ఉండాలి.

కమ్యూనికేషన్ లేకపోవడం

తరచుగా భార్యాభర్తలు  చిన్న చిన్న విషయాలకు  ద్వేషాలను పెంచుకుంటారు.  ఈ కోపం ద్వేషం కారణంగా ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయరు. క్రమంగా ఈ దూరం కాస్త సంబంధం తెగిపోయే స్థాయికి చేరుకుంటుంది . విడాకులకు ఇది అతిపెద్ద కారణాలలో ఒకటి.

సమయం  కేటాయింపు..

నేటి బిజీ జీవితాల్లో పని,  బాధ్యతలు తరచుగా  ఇబ్బంది పెడతాయి. భార్యాభర్తలు  ఒకరికొకరు సమయం కేటాయించకుండా నిరోధిస్తాయి. ఈ నిర్లక్ష్యం సంబంధాన్ని దెబ్బతీస్తుంది. ఇది చాలా కీలకం. లేకుంటే వివాహం కేవలం లాంఛనప్రాయంగా మారుతుంది.

ఆర్థిక ఒత్తిడి..

డబ్బు సమస్యలు తరచుగా అతిపెద్ద తగాదాలకు కారణమవుతాయి. పరిష్కరించకపోతే వివాహంలోని ఆర్థిక సమస్యలు విడాకులకు దారితీయవచ్చు . కాబట్టి డబ్బు విషయాలను ఓపెన్ గా  చర్చించడం ముఖ్యం.

బయటి జోక్యం..

వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత సంబంధం. కానీ ఇతరులు జోక్యం చేసుకోవడం ప్రారంభించినప్పుడు సమస్యలు తలెత్తుతాయి. తల్లిదండ్రులు లేదా అత్తమామల నుండి అధిక జోక్యం తరచుగా భార్యాభర్తల మధ్య అన్ని రకాల అటాచ్మెంట్ లను  నాశనం చేస్తుంది.

సంబంధాన్ని ఎలా కాపాడుకోవాలి

ఒకరు చెప్పేది మరొకరు  జాగ్రత్తగా వినాలి. ఇద్దరూ కలిసి చర్చించుకోవడం  ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి.  సంబంధంలో నమ్మకాన్ని కాపాడుకోవాలి.  ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి.  

తప్పులను క్షమించడం నేర్చుకోవాలి.  భార్యాభర్తలు ఇద్దరూ శత్రువులు కాదు. వారిద్దరూ ఒక అపురూపమైన బంధంలో ఉంటారు. ఒకరు తప్పు చేసినప్పుడు ఆ తప్పు గురించి పాజిటివ్ గా చర్చించి వాటిని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలి.

భార్యాభర్తల మధ్య సంబంధం చాలా సున్నితమైనది. అహం, కమ్యూనికేషన్ లేకపోవడం, సమయ పరిమితులు, ఆర్థిక ఒత్తిడి లేదా ఇతరుల జోక్యం మొదలైనవి బందం నాశనం కావడానికి  దారితీయవచ్చు. భార్యాభర్తలు ఇద్దరూ తమ  బంధం బలంగా ఉండాలని మీరు కోరుకుంటే పైన  చెప్పుకున్న ఏ విషయాలు వారికి అసలు సమస్యలా అనిపించవు. వాటిని ఇద్దరి మధ్య రానివ్వకుండా చూసుకోవచ్చు.

                                      *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu