డ్రోన్ సాయంతో జవహరీ అంతం
posted on Aug 3, 2022 2:07PM
ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా సారథ్య బాధ్యతలు చేపట్టిన అయిమాన్ అల్ జవహరిని కూడా అంతమొందించామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అమెరికా గూడఛార సంస్థ సీఐఏ సహకారంతో 71 ఏళ్ల జవహరిని అమెరికా సేనలు అత్యంత వ్యూహాత్మకంగా అంతంచేశారు. అమెరికా ఈ దాడిలో కేవలం ఒక డ్రోన్, రెండు హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ క్షిపణులతో ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్ర వాద నేత ను కడతేర్చింది. దీంతో అమెరికాలో ట్విన్ టవర్‌పై అల్‌ఖయిదా దాడికి ప్రతిఫలంగా పగ తీర్చుకున్నట్టుగా అమెరికా ప్రకటించింది. అల్-జవహరీ అమెరికా పౌరులపై దాడులు, హత్యారోపణలు ఎదుర్కొంటు న్నా డని బైడన్ తెలిపారు.
కాగా, ఈ దాడిలో వినియోగించిన హెల్ ఫైర్ క్షిపణులు ఎలాంటి పేలుడు లేకుండానే పనిపూర్తిచేశాయి. కాబూల్ లోని తన నివాసంలో బాల్కనీలో ఉన్న జవహరిని గుర్తించగానే, డ్రోన్ నుంచి వెలువడిన హెల్ ఫైర్ క్షిపణులు ఒక్కదుటున దూసుకెళ్లి ఆయన శరీరాన్ని చీల్చివేశాయి. దాంతో అక్కడేమీ పేలుడు లేకుండానే ఆపరేషన్ పూర్తయింది. జవహరి రహస్యంగా నివసిస్తూనే ప్రపంచదేశాల్లో అనుచరులకు ఆదే శాలు పంపుతూ దాడులను నిర్వహిస్తుండేవాడు. కాగా అతన్ని హతమార్చడంతో న్యాయం జరిగిం దని బైడెన్ అన్నారు. కాగా ఈ డ్రోన్ దాడి సమయంలో జవహరి కుటుంబ సభ్యులు అదే భవనంలో ఉన్నప్ప టికీ ఆయన్నుమాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు.