హైదరాబాద్ పై ఉగ్రపంజా?దసరా సందర్భంగా విధ్వంసానికి కుట్ర

దసరా పర్వదినాన హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చార్జిషీట్ దాఖలు చేసింది. పేలుళ్ల ద్వారా మారణహోమం సృష్టించేందుకు లష్కరే తొయిబాకు చెందిన ముగ్గురు  ఉగ్రవాదులు కుట్ర పన్నారని అందులో పేర్కొంది.   భారీ పేలుడు పదార్ధాలతో పేలుళ్లకు ముష్కరులు పథకం రూపొందించారని ఎన్ఐఏ చార్జ్ షీట్ లో పేర్కొంది. 

దేశంలో అత్యంత రద్దీగా ఉండే నగరమైన హైదరాబాద్ లో  పేలుళ్లకు కుట్ర కేసులో పట్టుబడిన ఉగ్రవాదులలో నగరానికి చెందిన మహ్మద్ అబ్దుల్ వాజిద్, సమీయుద్దీన్, హసన్ ఫరూక్ లు ఉన్నారు. వీరి నుంచి నగదు, హ్యండ్ గ్రెనేడ్ లను స్వాధీనం చేసుకున్నారు.

వీరిలో ఇద్దరు పాకిస్థాన్ కు చెందిన ఎల్ ఇటీ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ, అతని సహచరులు సిద్ధిక్ బిన్ ఉస్మాన్, అబ్దుల్ మజీద్ తో పాటు ఇతర లష్కరే తొయిబా ఉగ్రవాదులతో టచ్ లో ఉన్నారని ఎన్ఐఏ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. రద్దీగా ఉండే ప్రాంతాలను ముష్కరులు టార్గెట్ చేసి పేళుళ్లక పాల్పడాలన్నది వీరి పథకంగా పేర్కొంది.