ఏపీ తలరాత ఇంతే!

14వ ఆర్థిక సంఘం ప్రత్యేక కేటగిరీ హోదా రాష్ట్రాలు, సాధారణ కేటగిరీ రాష్ట్రాల మధ్య వివక్ష చూలేదు కనుకే అందుకే ప్రత్యేక కేటగిరీ హోదా స్థానంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేటాయించినట్టు కేంద్ర స్పష్టం చేయడం ఏపీకి ఏవిధంగా నైనా షాకింగ్ న్యూస్ కాదు.. గత కొన్నేళ్లుగా కేంద్ర చెబుతునన మాట ఇదే. మరో సారి 

ఇదే విషయాన్ని రాజ్య సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు  విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. కేంద్ర ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకోవాలన్న ఫైనాన్స్ కమిషన్ సీఫారుసుల మేరకు 2015-20 మధ్య కాలంలో రాష్ట్రాల వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగిందని మంత్రి సెలవిచ్చారు.  15 వ ఆర్థిక సంఘం 2020-26 కాలానికి ఎటువంటి ముఖ్యమైన మార్పులు చేయలేదని, జమ్మూకాశ్మీర్ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించడంతో కోటా స్వల్పంగా 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించిన విషయాన్ని మంత్రి  వివరించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఏపీ ఉన్నప్పుడు.. ఏపీ లోని పారిశ్రామికవేత్తలు భారీగా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టి, అనేక మంది జీవనోపాధిని కల్పించారు.  పెద్ద పరిశ్రమలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. 2014లో ఏపీ రెండుగా చీలిపన్నప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్  తెలంగాణలో ఉండిపోగా.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అనాధలా మిగిలిపోయిందనే వాదన ఇప్పుడు కూడా వివనస్తూనే ఉంది. 

  విభజన సమయంలో హైదరాబాద్ ను ఆంధ్రప్రదేశ్ కోల్పోయినట్లుగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లు విభజనల ద్వారా    తమ రాజధానులను కోల్పోలేదు. అయితే కేంద్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన లోపభూయిష్టంగా జరిగిందని ఒక వైపు చెబుతూనే, ఆ లోపభూయిష్ట విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి ఏ విధంగానూ ముందుకు రావడం లేదు. ఈ విషయంలోనే గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలో విభేదించి ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. మెజారిటీ ఇవ్వండి ప్రత్యేక హోదా సాధించుకువస్తామంటూ వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం అటుంచి.. కేంద్రం తానా అంటే తందానా అంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి మరోసారి రాష్ట్ర సభలో కుదరదని స్పష్టం చేశారు. ఇక ఏపీ గతి ఇంతే అని ఆయన చెప్పకనే చెప్పేశారు.