నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత... ఇథనాల్ కంపెనీమూసివేయాలని ఆందోళన 

నిర్మల్ జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇథనాల్ ప్యాక్టరీకి వ్యతిరేకంగా దిలావర్ పుర గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.  నిన్న రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో జిల్లా అధికారులు 20 మంది రైతులు చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.  మరో వైపు గ్రామస్థులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.  దిలావర్ పుర్ జాతీయ రహదారిపై గ్రామస్థులు ఆందోళనకు దిగారు.  ఇథనాల్ పరిశ్రమను మూసి వేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.  ఆ మార్గం గుండా వస్తున్న ఆర్డీవో కళ్యానిని గ్రామస్థులు అడ్డుకున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu